డ‌బ్బుక‌న్నా సెక్స్‌తోనే మ‌నిషి సంతోషంగా ఉంటాడ‌ట‌..!

sex-life

నిధి చాలా సుఖ‌మా.. సెక్స్ చాలా సుఖ‌మా…? అంటే రెండోది కావాలంటున్నారు మ‌న యూత్‌. డ‌బ్బుకంటే సెక్స్‌లోనే ఎక్కువ సుఖం ఉంద‌ని, ఆ రెండింటిలో ఏది మీకు సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని పంచుతుంద‌ని అడిగితే రెండో దానికే ఓటేస్తున్నారు యువ‌కులు. కెన‌డాలోని ప్ర‌ఖ్యాత టొరంటో యూనివ‌ర్శిటీ నిర్వ‌హించిన ఈ స‌ర్వే ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. డ‌బ్బు ఎక్కువ‌గా ఉన్న వాళ్లు ఎక్కువ ఆనందంగా ఉన్నారా..? లేక‌, శృంగార జీవితాన్ని ఆనందిస్తున్న వారు ఎక్కువ హ్యాపీగా ఉన్నారా? అని చేప‌ట్టిన స‌ర్వేలో రెండో కేట‌గిరీ వ్య‌క్తులే జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నామ‌ని తెలిపార‌ట‌.

ఇది ఓ ఆన్‌లైన్ సర్వే. ఈ స‌ర్వేలో ఇంకా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌ను సంధించింది ఆ స‌ర్వే. అందులో ఒక‌టి.. శృంగారంలో ఎన్ని సార్లు పాల్గొంటారు..? అని. దీనికింద రోజు. వారం. 15 రోజులు. నెల‌రోజులు. అంటూ ఆప్ష‌న్‌ల‌ను పొందు ప‌రిచింది. దీనితో రెండో దానికే ఓటేశారు. వారానికి ఓక‌సారి సెక్స్ చేస్తామ‌ని, అయినా హ్యాపీగా ఉన్నామ‌ని వారు తెలిపార‌ట‌. అయితే, వారానికి ఒక‌సారి సంభోగంలో పాల్గొన‌డంతో హ్యాపీగా ఉన్నారా..? అంటే ఇన్ని సార్లు అని ప్రామాణికంగా చెప్ప‌లేం కానీ, ఆనంద‌క‌ర‌మయిన జీవితానికి వారానికి మినిమ‌మ్ ఒక్క‌సారయినా సెక్స్ త‌ప్ప‌నిస‌ర‌ని వారు వివ‌రించారు.

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈ స‌ర్వే దాదాపు 30వేల మంది జీవితాల‌లోకి తొంగి చూసింద‌ట‌. అంటే, శాంపిల్ చాలా పెద్ద‌ది అని చెబుతున్నారు ప‌రిశోధ‌కులు. పెళ్ల‌యిన వారు, దీర్ఘ‌కాలంగా స‌హ‌జీవనంలో ఉన్న‌వారిని అడిగితే.. వారు కూడా వ‌న్స్ ఇన్ ఏ వీక్ ఈజ్ ది మేజిక్ నంబ‌ర్ అని దీర్ఘాలు తీస్తున్నార‌ట‌. దీంతో, వారానికి ఒక‌సారి అనేదానికే ఎక్కువ‌మంది ఓటేశార‌ని, అయినా వారు సంతోషంగా ఉన్నార‌ని విశ్లేషిస్తున్నారు.

కొత్త‌గా పెళ్ల‌యిన దంప‌తుల‌కు, హ‌నీమూన్ ఎంజాయ్ చేస్తున్న‌వారికి.. ముఖ్యంగా యూత్‌కి వారానికి ఒక‌సారి అంటే కాస్త త‌క్కువ టైమ్స్ అనిపించినా.. సీనియ‌ర్‌లకు మాత్రం ఇదే ది బెస్ట్ అని అంటున్నారు. వివాహం అయిన త‌ర్వాత కొన్నాళ్ల‌కు త‌మ త‌మ లైఫ్‌లో, జాబ్‌లో బిజీ అయిన వారికి వ‌న్స్ ఇన్ ఏ వీక్ అనేది మేజిక్ ఫిగర్ అని అధ్య‌య‌న‌క‌ర్త‌లు వివ‌రిస్తున్నారు. అయితే, దీనికి వారు వివ‌ర‌ణ కూడా ఇస్తున్నారు. వీక్లీ వ‌న్స్ అంటే.. మిగ‌తా ఆరు రోజులు ప‌స్తులుండ‌డం కాద‌ని, కౌగిలింతలు, ముద్దు ముచ్చ‌ట, మురిపెంతోపాటు చిన్న చిన్న ట‌చింగ్స్‌ని మిస్ అయిన‌ట్లు భావించ‌కూడ‌ద‌ని వారు చెబుతున్నారు. కానీ, వారానికి ఒక‌సారి చేసుకున్నా.. డ‌బ్బు కంటే శృంగార‌మే వారికి సంతోషాన్ని ఇస్తుంద‌ని చెప్ప‌డం మంచి ప‌రిణామ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నేటి యాంత్రిక జీవ‌నంలో సెక్స్ రొటీన్‌గా మారుతున్న టైమ్‌లో ఈ చిన్న‌పాటి స‌ర్వే సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంద‌ని పరిశోధ‌కులు చెబుతున్నారు. ఆలుమ‌గల దాంప‌త్య జీవ‌నం మ‌రింత‌గా వికాసించాలంటే సెక్స్ తప్ప‌నిసరి అంటున్నారు.

Loading...

Leave a Reply

*