రూ. 2000 వేల నోట్ల స్పెషాలిటీస్ ఏంటంటే…!!!

new-2000-note

కొత్త నోట్లు మార్కెట్‌లోకి వ‌చ్చేశాయి. తొలిసారిగా 2వేల నోట్లని ప్ర‌వేశ పెట్టింది ఇండియ‌న్ గ‌వ‌ర్నమెంట్‌. ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌.. ఉర్జిత్ ప‌టేల్ సంత‌కం చేసిన 2వేల నోట్ల రూపాయ‌లు ప్ర‌జ‌ల చేతుల్లో రెప‌రెప‌లాడుతున్నాయి. ఈ నోటుని స్పెష‌ల్‌గా డిజైన్ చేసింది ఆర్‌బీఐ. కొత్త నోటులో కుడివైపున 2000 అంకె దేవ‌నాగ‌రి లిపిలో ఉంటుంది. మ‌హాత్మాగాంధీ బొమ్మ గ‌తంలో కాకుండా.. నోటు మ‌ధ్య‌లో ఉంటుంది. ఇక‌, నోటుకింద భాగంలో కూడా 2000 అంకె ఉంటుంది. అయితే, 45 డిగ్రీలు వంచి చూస్తేనే ఇది కనిపిస్తుంది.

2000 నోటుపై కొన్ని చిన్న అక్ష‌రాలు కూడా ఉన్నాయి. ఆర్‌బీఐ అని ఇంగ్లీష్ లెట‌ర్స్‌తో పాటు 2000 అని నోటుకి ఎడ‌మ‌వైపున ఉంటాయి. భార‌త్ అని సెక్యూరిటీ థ్రెడ్ కింద ఉంటుంది. ఆర్‌బీఐ, 2000 లెట‌ర్స్‌.. గులాబీ రంగులో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. గ‌తంలో నోటుపై ముద్రించే థ్రెడ్ ఆకుప‌చ్చ రంగులో ఉండేది. ప్ర‌స్తుతం అది నీలిరంగులోకి మార్చారు. గ్యారెంటీ క్లాజ్‌, ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ సంత‌కం వంటివి నోటుకి కుడివైపున ఉండేలా డిజైన్ చేశారు.

మ‌హాత్మాగాంధీ బొమ్మ‌కు కుడివైపున అశోక స్తూపం ఉంది. 2000 అంకె ఎల‌క్ర్టోటైప్ వాట‌ర్ మార్క్ ఎడ‌మ‌వైపు నుంచి కుడివైపుకు ఉంటుంది. నెంబ‌ర్ ప్యానెల్ సంఖ్య‌లో ఎడ‌మ‌వైపు నుంచి కుడికి పెరుగుతూ ఉంటుంది. ఇలా సైజ్ పెర‌గ‌డం ఈ కొత్త నోటు స్పెషాలిటీ. పాత నోట్ల‌లో అన్నీ అంకెలు ఒకేలా ఉంటాయి.

ఇక నోటుకి ఎడ‌మ‌వైపున నోటు ముద్రించిన సంవ‌త్స‌రం ఉంటుంది. స్వ‌చ్చ‌భార‌త్ లోగో, నినాదం ఉంటాయి. ఇక పాత 500, 1000 రూపాయ‌ల నోట్ల‌లో వివిధ లాంగ్వేజెస్ స్థానం ఎడ‌మ‌వైపు క‌నిపించేది. దీని స్థానంలో కొత్త నోటులో మంగ‌ళ‌యాన్ క‌నిపిస్తుంది. ఇక చూపులేని వారికోసం కూడా కొన్ని స్పెష‌ల్ ఫీచ‌ర్స్ ఉన్నాయి. మ‌హాత్మాగాంధీ బొమ్మ‌, అశోక‌చ‌క్రం కాస్త ఒత్తుగా ఉండ‌నున్నాయి. బ్లీడింగ్ లైన్‌లు, ఐడెండిటీ మార్క్ వంటివి కూడా చేతితో తాకితే సైతం ఒక అనుభూతి వ‌చ్చేలా చేశారు. ఇక‌, కోణీయ రేఖ‌లు కుడి, ఎడ‌మ‌వైపు ఉంటాయి. వీటితో పాటు పాత నోట్ల‌లో క‌నిపించ‌ని కొన్ని కొత్త ఫీచర్స్‌ను కూడా యాడ్ చేశారు. కొత్త నోటుతో ఇక ఫేక్ నోట్లు మార్కెట్‌లోకి రాకుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. మ‌రి, ఆర్‌బీఐ తీసుకున్న చ‌ర్యలు ఏమేర‌కు స‌త్ఫ‌లితాలు ఇస్తాయో చూడాలి.

Loading...

Leave a Reply

*