జ‌బ‌ర్ద‌స్త్‌కి పోటీగా కొత్త కామెడీ షో రెడీ…!

jabbardhasth

జ‌బ‌ర్ద‌స్త్‌.. యూత్‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని కామెడీ షో. తెలుగు బుల్లితెర చ‌రిత్ర‌లో ఏళ్ల త‌ర‌బ‌డి టాప్ రేటింగ్స్ ద‌క్కించుకుంటున్న టాప్ ప్రోగ్రామ్‌. చెప్పేవి, చేసేవి అన్నీ బూతు స్కిట్‌లే అయినా యూత్‌కి మాత్రం విపరీతంగా న‌చ్చేసింది. ఒక్క యూతేకాదు.. ఇంటిల్లి పాదీ స‌ర‌దాగా చూసుకునే ప్రోగ్రామ్‌గా మారిపోయింది జ‌బ‌ర్ద‌స్త్‌. అది స‌క్సెస్ కావ‌డంతో దానికి పుట్ట‌గొడుగుగా వ‌చ్చిన ఎక్‌స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కూడా పుట్టింది. ఈటీవీలో ప్ర‌తి గురువారం, శుక్ర‌వారం ప్ర‌సార‌మయ్యే ఈ ప్రోగ్రామ్‌కి భారీ లెవ‌ల్‌లో అభిమానులు ఉన్నారు. అందుకే, హ‌య్య‌స్ట్ టీఆర్‌పీలో పొందుతోంది.

గ‌త మూడు నాలుగేళ్లుగా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ టీవీల‌లో ప్ర‌సార‌మ‌వుతోంది. అంత‌కంత‌కూ దాని వ్యూయ‌ర్‌షిప్ పెరుగుతుందే కానీ, త‌ర‌గ‌డం లేదు. ఇదే ఇప్పుడు ఇత‌ర టీవీ చానెల్స్ క‌న్ను ప‌డేలా చేసింది. జ‌న‌ర‌ల్‌గా ఓ ప్రోగ్రామ్ కానీ, రియాలిటీ షో కానీ, గేమింగ్ కానీ, సీరియ‌ల్ కానీ, స‌క్సెస్ అయిందంటే దాని కాపీ కంటెంట్ పుట్టుకురావ‌డం క్ష‌ణాల్లో ప‌ని. కానీ, జ‌బ‌ర్ద‌స్త్ లాంటి కామెడీ షో చెయ్యాల‌ని ఒక‌టీ రెండు చానెల్స్ గ‌తంలో ప్ర‌యత్నించాయి కానీ, ఏవీ స‌క్సెస్ కాలేదు.

యూ ట్యూబ్‌లోనూ జ‌బ‌ర్ద‌స్త్ షోకి ఊహించ‌ని రేంజ్‌లో హిట్స్ వ‌స్తున్నాయి. అందుకే, ఓ చానెల్ జ‌బర్ద‌స్త్‌కి పోటీగా ఓ కామెడీ షోని షురూ చేసే ఆలోచ‌న‌లో ఉంది. ఇందులో జ‌డ్జ్‌లుగా పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌మ్య‌కృష్ణ‌ను ఆల్‌మోస్ట్ ఫైన‌ల్ చేశార‌ట‌. అయితే, ఈ ఇద్ద‌రూ నాగ‌బాబు, రోజాని డామినేట్ చేస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, కొత్త న‌టీన‌టులు కూడా ఆ రేంజ్‌లో దొరుకుతారా? అనేది మ‌రో ప్ర‌శ్న‌. కొత్త ప్రోగ్రామ్‌లో బూతు కంటెంట్‌ని చాలా వ‌ర‌కు త‌గ్గించి ఆరోగ్య‌క‌ర‌మైన హాస్యాన్ని అందిస్తార‌ట. ఇది మంచిదే కదా. మ‌రి, కొత్త ప్రోగ్రామ్ ఏ రేంజ్‌లో స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Loading...

Leave a Reply

*