పూరి డెన్‌లో హ‌రికృష్ణ గిఫ్ట్‌.. పిల్ల‌లు పెడుతోందట‌..!

puri-jaghanadh

ద‌ర్శ‌కుల‌కి హీరోలు గిఫ్ట్‌లు ఇవ్వ‌డం చాలా కామ‌న్‌. మొన్నామ‌ధ్య మ‌హేష్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కి ఖ‌రీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక‌, జ‌న‌తా గ్యారేజ్ హ్యూజ్ స‌క్సెస్ అయినందుకు త్వ‌ర‌లోనే ఓ విల్లాను బ‌హుమ‌తిగా ఇవ్వ‌బోతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా, ఒకే సినిమాలో ప‌ని చేసినందుకు గిఫ్ట్‌లు చాలా స‌హ‌జం.

కానీ, ఈసారి నంద‌మూరి సీనియ‌ర్ హీరో, సీనియ‌ర్ పొలిటీషియ‌న్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ ఫాద‌ర్ హ‌రికృష్ణ పూరికి గిఫ్ట్ ఇచ్చాడ‌ట‌. అదేంటి అనుకుంటున్నారా..? అది జంట పావురాల‌ని బ‌హుమ‌తిగా అందించాడ‌ట‌. అవి ఇప్పుడు త‌న డెన్‌లో ఉన్నాయ‌ని, ఇటీవ‌ల రెండు గుడ్లు కూడా పెట్టాయ‌ని తెలిపాడు. క‌ల్యాణ్‌రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ఇజ‌మ్ సినిమా చేశాడు. ఈ మూవీ సినిమా ట్ర‌యిల‌ర్‌, టీజ‌ర్ చూసిన హ‌రికృష్ణ పూరికి ఆ గిఫ్ట్ ఇచ్చాడ‌ట‌.

పూరికి జంతువులంటే ప్రాణం. తాను షేర్ చేసే ట్వీట్స్‌లో ఎక్కువ‌గా అవే క‌నిపిస్తుంటాయి. ఇటు, తాను క‌ట్టుకున్న ఆఫీస్‌కి కూడా డెన్ అని పేరు పెట్టుకున్నాడు. అక్క‌డ ఎక్కువ‌గా ప‌క్షులు, జంతువులే క‌నిపిస్తుంటాయి. దీనిలో భాగంగానే తెలిసి హ‌రికృష్ణ‌కి పూరికి పావురాల‌ని బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ట‌.

Loading...

Leave a Reply

*