రాజ‌కీయాల్లోకి న‌మ్ర‌త‌?

namrata

న‌మ్ర‌త‌… మాజీ హీరోయిన్‌… సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు భార్య‌… ఎంతో విన‌మ్రంగా ఉండే న‌మ్ర‌త భ‌ర్త చాటు భార్య కాదు.. ఆమె ఈ త‌రం ఇల్లాలు… త‌న భ‌ర్త‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌తి గెలుపు, మలుపులో న‌మ్ర‌త భాగ‌స్వామి… ఇంతింతై న‌టుడింతై అన్న‌ట్టు సూప‌ర్‌స్టార్‌గా ఎదిగిపోయి తెలుగులో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్న మ‌హేష్‌బాబు ఆ స్థాయికి చేరుకోవ‌డానికి వెన‌క న‌మ్ర‌త ఉంద‌న్న‌ది ప‌చ్చి నిజం… మ‌హేష్‌బాబు తెర‌పై సూప‌ర్‌స్టార్‌గా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకోవ‌డం.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల‌ల‌తో తెలుగులో బిగ్గెస్ట్ బ్రాండ్‌గా ఎద‌గ‌డానికి వెన‌క న‌మ్ర‌త సూచ‌న‌లు స‌ల‌హాలు స‌హ‌కారం ఉన్నాయ‌న్న‌ది వాస్త‌వం..

అలాంటి నమ్ర‌త ఇప్పుడు రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించు కున్నారుట‌…. 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి ఆమె స్కెచ్ గీస్తున్నారుట‌..గ‌తంలో మ‌హేష్‌బాబు తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ కూడా రాజ‌కీయాల్లో రాణించారు.. కాంగ్రెస్ త‌ర‌ఫున ఆయ‌న ఎంపీగా కూడా ప‌నిచేశారు… మ‌హేష్ బాబాయ్ ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు ప్ర‌స్తుతం వైఎస్సార్సీలో ఉన్నారు…. మ‌హేష్ బావ గ‌ల్లా జ‌య‌దేవ్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా ఉన్నారు… ఇలా ఏపీలోని రెండు బ‌ల‌మైన పార్టీల్లో బంధువులు ఉండ‌డంతో న‌మ్ర‌త రాజ‌కీయ ప‌య‌నం ఏ పార్టీలోకి అనేది ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు….

త‌న స‌తీమ‌ణి పొలిటిక‌ల్ ఎంట్రీకి మ‌హేష్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చి ఆశీర్వ‌దించేశాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి…అయితే మ‌హేష్‌బాబు తాను ప్ర‌త్య‌క్షంగా రాజ‌కీయాల్లోకి రాకుండా ప‌రోక్షంగా ఇలా భార్య ద్వారా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటున్నార‌ని పొలిటిక‌ల్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు…. తాను నేరుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఏదో ఒక పార్టీలో చేరితే ఇత‌ర పార్టీల్లో ఉండే త‌న అభిమానులు హ‌ర్ట్ అవుతార‌ని, అందుకనే అభిమానుల‌ను నొప్పించ‌కుండా ఇలా ఇన్‌డైరెక్టుగా రాజ‌కీయాల్లోకి రావాల‌ని మ‌హేష్ చూస్తున్నార‌ని స‌మాచారం.

Loading...

Leave a Reply

*