చైతు స‌మంత ప్ర‌త్యేక పూజ‌లు.. మేట‌ర్ ఏంటి.. నిశ్చితార్ధ‌మా….!

naga-chaitanya-samantha-special-poojalu

చైతు-స‌మంత ఫోటోలు, వీడియో లీక్‌లు మాత్రం ఆగ‌డం లేదు. మొన్న‌టిదాకా వాళ్లిద్ద‌రూ షాపింగ్ మాల్స్‌, షికార్‌ల ఫోటోలు, ఒకే ఇంట్లో క‌లిసి ఉంటున్న వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తాజాగా వారి పెళ్లి, వివాహం, దానికి సంబంధించిన పూజ‌ల ఫోటోలు సోష‌ల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఇవాళ సాయంత్రం విడుద‌ల‌యిన ఫోటో.. ఎన్నో ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతుంది.

నాగ‌ద‌చైత‌న్య‌-స‌మంత క‌లిసి పూజ‌లు చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇద్ద‌రూ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చొని వేద పండితుల స‌మక్షంలో ఏవో మంత్రాలు చ‌దివి, అక్షింత‌లు తీసుకున్న‌ట్లు క్లియ‌ర్‌గా కనిపిస్తోంది. ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. అక్క‌డ ప‌దిమందికి పైగా వేద పండితులు, బ్రాహ్మ‌ణులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటు, అక్కినేని కుటుంబం కూడా అక్క‌డే ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంది. ఎందుకంటే నాగార్జున అక్క‌డే ఉన్నాడు. నాగార్జున మిన‌హా మిగిలిన కుటుంబం కూడా హాజ‌ర‌యిందా? లేదా? అనేది తేలడం లేదు. అయితే, నాగ‌చైత‌న్య‌-స‌మంత ప‌క్క‌పక్క‌నే పీట‌ల మీద కూర్చొని ఏం చేశారు..? ఎందుకీ స్పెష‌ల్ ..? ఇవి పూజలా..? లేక‌, ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఏవైనా ఫోటోలా..?

సీక్రెట్‌గా నిశ్చితార్ధం చేయాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఇప్ప‌టికే నాగ‌చైత‌న్య‌-స‌మంత‌.. పెళ్లి దాదాపు క‌న్‌ఫ‌మ్ అయింది. ఇటు నాగార్జున ఓపెన్ అయ్యాడు. త్వ‌రలోనే మ్యారేజ్ అంటూ చెప్పేశాడు. ఇటు స‌మంత కూడా వివాహ వార్త‌ను ట్విట్ట‌ర్‌లో చెప్పేసింది. చెన్నైలో నాగ‌చైత‌న్య కూడా త‌న కాబోయే భార్య స‌మంత అని బైట్ ఇచ్చేశాడు. అయితే, మ్యారేజ్ డేట్ మాత్రం ఇంత‌వ‌ర‌కు ఫిక్స్ కాలేదు. అది వాళ్లిద్ద‌రి ఇష్టం… పెళ్లి ఎప్పుడు అంటే అప్పుడే.. అంటూ నాగార్జున తెలిపాడు. ఇటు నాగ‌చైత‌న్య‌-స‌మంత త‌మ వివాహం ఈ ఏడాది ఉండ‌ద‌ని.. 2017లోనే అంటున్నారు.

 

Loading...

Leave a Reply

*