షాకింగ్‌.. నోట్ల మార్పిడి ఏ క్ష‌ణ‌మైనా బంద్‌.. ఇక పూర్తిగా ఆన్‌లైన్ సేవ‌లే..!

notes-exchange

నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంలో రోజుకో కాదు.. పూట‌కో కొత్త న్యూస్ వెలుగులోకి వ‌స్తోంది. మొద‌ట 4వేలు, ఆ త‌ర్వాత 4500 రూపాయ‌ల వ‌ర‌కు నోట్ల మార్పిడికి ఓకే అన్న కేంద్ర స‌ర్కార్‌.. ఆ త‌ర్వాత దానిని 2వేల‌కు కుదించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనితోనే జ‌నాలు తీవ్రంగా అవ‌స్థ‌లు పడుతుంటే.. తాజాగా కేంద్రం కొత్త యోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 24 త‌ర్వాత ఏక్ష‌ణ‌మైనా నోట్ల మార్పిడిని ఆపేస్తార‌ట‌. అంటే, మీ ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బును బ్యాంక్‌ల‌లో జ‌మ చేసుకోవాలి. వాటిని కావాలంటే మీరు చెక్ లేదా ఏటీఎమ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా వాడుకోవాలి.

అంతేకానీ, గ‌తంలో తిరిగిన‌ట్లు ఎక్కువ క్యాష్‌తో తిరగాల‌ని భావిస్తే మాత్రం అది కుద‌రని ప‌ని అంటోంది కేంద్ర స‌ర్కార్‌. దేశంలో న‌గ‌దు ర‌హిత ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను తీసుకు రావ‌డ‌మే మోదీ స‌ర్కార్ యోచ‌న‌గా తెలుస్తోంది. అందుకే, ప్ర‌జ‌ల‌లో ఎంత వ్య‌తిరేక వ‌చ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదుర‌యినా వెన‌క్కి త‌గ్గేదేలేద‌ని స్ప‌ష్టం చేస్తోంది. జ‌నాలు ఖ‌ర్చు చేసే, మార్కెట్‌లో చ‌లామ‌ణిలో ఉన్నప్ర‌తి పైసాని దాదాపు లెక్క‌లోకి వ‌చ్చేలా మోదీ సర్కార్ చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ట‌. ఇప్ప‌టిదాకా తీసుకున్న నోట్ల మార్పిడి చిన్న అంశ‌మే అనీ, మోదీ ద‌గ్గ‌ర అంత‌కుమించిన ఆలోచ‌న‌లు, ప్ర‌ణాళిక‌లు చాలా ఉన్నాయ‌ని తెలుస్తోంది. అందుకే, ఈ నెల 24 త‌ర్వాత ఇక బ్యాంక్‌ల‌లో నోట్ల మార్పిడికి దాదాపు గుడ్ బై చెప్పే విధంగా ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి మోదీ స‌ర్కార్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా కొన్ని న‌గ‌రాల‌లో బ్యాంక్ అధికారులు.. న‌గ‌దు మార్పిడికంటే మ‌నీ మీ అకౌంట్ల‌లో వేసుకొని వాడుకోవాల‌ని సూచిస్తున్నాయ‌ట‌. మ‌రి, ఈ తాజా ప‌రిణామంతో ఎలాంటి సంచ‌ల‌నాలు సంభ‌విస్తాయో చూడాలి.

Loading...

Leave a Reply

*