మ‌రికొద్ది రోజుల్లో జీఎస్‌టీ.. ఇక మీ ఫోన్ బిల్లు మోతే…!

gst

జీఎస్‌టీ త్వ‌ర‌లోనే అమల్లోకి రానుంది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా దీనిపై అటు కేంద్ర ప్ర‌భుత్వం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఓ కొలిక్కి వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే దీనిపై కేంద్రం పార్ల‌మెంట్‌లో బిల్లును పాస్ చేయ‌నుంది. మొత్తం వ‌స్తువులు, సేవ‌ల‌ను నాలుగు శ్లాబ్‌లుగా విభ‌జించింది కేంద్ర ప్ర‌భుత్వం. 5, 12, 18, 28 శాతం శ్లాబ్‌ల‌తో విభ‌జించింది.

జీఎస్‌టీతో ముఖ్యంగా ఫోన్ బిల్లుల మోత మోగ‌నుంద‌ని స‌మాచారం. టెలికం ప‌రిశ్ర‌మ ప్ర‌స్తుతం 15 శాతం ప‌న్నుల జాబితాలో ఉంది. జీఎస్‌టీ ఆమోదిస్తే.. దీనిని 12 శాతం ప‌రిధిలోకి తెస్తే.. ప్ర‌భుత్వ ఆదాయానికి భారీగా గండిప‌డ‌నుంది. సో.. కేంద్రం దీనికి సిద్ధ‌మ‌య్యే చాన్స్ లేదు. ఇప్ప‌టికే రాష్ట్రాల‌కు ఇచ్చే ప‌న్నుల వాటా పెంచ‌డంతో మోదీ స‌ర్కార్ 12 శాతం శ్లాబ్‌లోకి ఈ బిల్లును తెచ్చే అవ‌కాశం లేదు. ఇక, మిగిలింది 18 శాతం శ్లాబ్‌. అంటే, ఇప్పుడు ఉన్న దానికి 3 శాతం ప‌న్ను పెరిగడం ఖాయ‌మ‌న్న‌మాట‌. ఇదే జ‌రిగితే.. మ‌న జేబుకి చిల్లు ప‌డ‌డం గ్యారంటీ. మ‌రి, కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Loading...

Leave a Reply

*