స్నాప్ సేల్స్‌…ఒక్క రోజులోనే వంద‌ల కోట్ల అమ్మ‌కాలు

san

ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం స్నాప్ డీల్ ఆన్‌లైన్ సేల్స్‌లో అద‌ర‌గొట్టేసింది… ద‌స‌రా, దీపావ‌ళి ధ‌మాకా ఆఫ‌ర్‌తో ఒక్క రోజులోనే వంద‌ల కోట్ల అమ్మ‌కాలు సాగించింది… త‌న డైలీ బిజినెస్‌కు ఏకంగా 9 రెట్లు అమ్మ‌కాల‌తో అబ్బుర‌ప‌రిచింది.. ధ‌ర‌లు త‌గ్గించి అమ్మ‌కాలు అధ‌ర‌హో అనిపించింది.. ద‌స‌రా, దీపావ‌ళి పండ‌గ సీజ‌న్‌లో కస్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప్రారంభించిన అన్‌బాక్స్ దీపావ‌ళి ఆన్‌లైన్ సేల్ తొలిరోజున అమ్మ‌కాలు ఎగిసిప‌డ్డాయ‌ని స్నాప్ డీల్ ప్ర‌క‌టించింది…. స్నాప్ డీల్ ప్లాట్‌ఫామ్‌గా అమ్మ‌కాలు నిర్వ‌హించే విక్ర‌య‌దారుల ట‌ర్నోవ‌ర్ ఒక్క రోజులోనే కోట్ల రూపాయ‌లు దాటిపోయి రికార్డులు సృష్టించింది… అయితే అదిరిపోతున్న ఈ అమ్మ‌కాల్లో అత్య‌ధిక శాతం మొబైల్స్ కొనుగోలుతోనే జ‌ర‌గ‌డం విశేషం… స్నాప్‌డీల్ మొత్తం అమ్మ‌కాల్లో 80 శాతం మొబైల్స్ వ‌ల్లే జ‌రుగుతోందిట‌…

కాస్మోపాలిట‌న్, మెట్రోపాలిట‌న్ మ‌హా న‌గ‌రాల నుంచే కాకుండా చిన్న చిన్న న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల నుంచి ఆర్డ‌ర్లు వెల్లువెత్తుతున్నాయ‌ని ఈ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గ‌జం ప్ర‌క‌టించింది.. త‌మ అమ్మ‌కాల్లో చిన్న న‌గ‌రాల నుంచి వ‌చ్చిన ఆర్డ‌ర్లు దాదాపు 20 శాతం ఉన్నాయంటోంది స్నాప్‌డీల్‌… తొలిరోజు అమ్మ‌కాల్లో భాగంగా ల‌క్ష జ‌త‌ల చెప్పుల‌ను అమ్మిన‌ట్టు సంస్థ చెబుతోంది… మ‌ల్టిపుల్ ఫ్యాష‌న్ బ్రాండ్స్‌లో డిస్కౌంట్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఫుట్‌వేర్ సేల్స్ అద‌ర‌గొట్టేస్తున్నాయ‌ని సంస్థ య‌జ‌మానులు చెబుతున్నారు.. మొబైల్ ఫోన్ల‌లో రెడ్‌మి నోట్‌3, ఐ ఫోన్ 6ఎస్‌, ఐ ఫోన్ 5ఎస్‌, మి మ్యాక్స్‌, లీ ఎకో, లీ మ్యాక్స్‌2లు టాప్ సెల్లింగ్ ఉత్ప‌త్తులుగా నిలిచిన‌ట్టు స్నాప్‌డీల్ వెల్ల‌డించింది. వీటితోపాటు ఏసీలు, కిచెన్ ఉప‌క‌ర‌ణాలు, ప్రెష‌ర్ కుక్క‌ర్లు, కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల‌వంటివి ఎక్కువ‌గా అమ్ముడుపోతున్నాయిట‌.. మొత్తానికి ద‌స‌రా, దీపావ‌ళి ధ‌మాకా పేరుతో స్నాప్‌డీల్ వంద‌ల కోట్లు కొల్ల‌గొడుతోంది.

Loading...

Leave a Reply

*