గాళ్‌ఫ్రెండ్ చ‌నిపోయి పాముగా పుట్టింది.. అందుకే పెళ్లి… కాపురం…!

snake-man

ఇది నిజంగా షాకింగ్ వార్త‌. ట్రాన్స్ జెండ‌ర్ వివాహాలు ఉన్నాం. అబ్బాయి-అబ్బాయి పెళ్లి చేసుకోవ‌డం చూశాం. ఇటు, అమ్మాయి-అమ్మాయి క‌లిసి కాపురం చేసుకోవ‌డ‌మూ విన్నాం. కొంద‌ర‌యితే దోషాల నివార‌ణ‌కు గాడిద‌తో, గుర్రాల‌తో మ్యారేజ్ చేసేవారిని సైతం మ‌నం సినిమాలలోనూ క్రైమ్ స్టోరీస్‌లోనూ చూశాం. కానీ, విచిత్రంగా ఓ పాముని మ్యారేజ్ చేసుకున్న వారి కేస్ విన్నారా..? స‌రిగ్గా ఇలాంటి సంచ‌ల‌న వివాహం చేసుకున్నాడు ఓ వ్య‌క్తి.

థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఓ పామును పెళ్లి చేసుకున్నాడు. దానితోనే కాపురం కూడా చేస్తున్నాడు. ఇదేంట్రా బాబూ.. పాముతో పెళ్లి ఏంట‌ని ఎవ‌రయినా పెద్ద‌లు ప్ర‌శ్నిస్తే.. అత‌డు చెబుతున్న స‌మాధానం వింత‌గా ఉంది. అది అచ్చం త‌న చ‌నిపోయిన గాళ్‌ఫ్రెండ్ మాదిరిగా ఉంద‌ని, దానిని చూస్తుంటే అదే గుర్తుకు వస్తోంద‌ని చెబుతున్నాడు. అందుకే, పాము అయినా దానికే మూడు ముళ్లు వేసాన‌ని అంటున్నాడు.

ఆ పామును భార్య‌లానే చూసుకుంటున్నాడు. ఒక్క శృంగారం మిన‌హా.. ఒక భార్య‌తో క‌లిసి ఏయే ప‌నులు చేస్తాడో అవే ప‌నుల‌ను పాముతోనూ చేస్తున్నాడట‌ ఈ వింత వ్య‌క్తి. దానితో క‌లిసి పార్క్‌కు వెళ్ల‌డం, టీవీ చూడ‌డం, దానికి స్నానం చేయించ‌డం వంటి వింత వింత ప‌నుల‌ను చేస్తున్నాడు. థాయ్‌ల్యాండ్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది ఈ పోస్ట్‌. చ‌నిపోయిన వ్య‌క్తులు తిరిగి జంతువులుగా జ‌న్మించే సిద్ధాంతాన్ని అత‌డు బ‌లంగా న‌మ్ముతాడ‌ని, అందుకే, దానితో అన్యోన్యంగా కాపురం చేస్తున్నాడ‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ఇది మ‌రి పిచ్చి అనాలో వెర్రి అనాలో లేక‌.. పుర్రెకో బుద్ది అని సరిపెట్టుకోవాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

Loading...

Leave a Reply

*