మృగ‌రాజు పెళ్లి… వెయ్యిమంది అతిథులు!

loin

అడ‌వికి రాజు సింహం. మ‌రి ఆ మృగ‌రాజు పెళ్లి అంటే మాట‌లా! అతిర‌థ‌మ‌హార‌థుల రాక‌… బెలూన్లు, బ్యాన‌ర్ల‌తో వేదిక అలంక‌ర‌ణ‌… మాంసంతో త‌యారు చేసిన భారీ కేక్ ఇలా అంగ‌రంగ వైభ‌వంగా ఆ సింహాల పెళ్లి జ‌రిగింది. బంగ్లాదేశ్‌లోని చిట్ట‌గ్యాంగ్ జూలో జ‌రిగిన ఈ వివాహ వేడుక‌కు దాదాపు వెయ్యిమంది హాజ‌ర‌య్యారు. వీరిలో చిట్ట‌గ్యాంగ్ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌, అడిష‌న‌ల్ డిస్ట్రిక్ట్ మేజిస్ర్టేట్ ఇంకా ఎందరో ఉన్న‌తాధికారులున్నారు. ఇంకా ప‌లు పాఠ‌శాల‌లకు చెందిన వంద‌లాది మంది విద్యార్థులున్నారు.

చిట్టగాంగ్ జూలో ఉన్న నోవా అనే ఆడ సింహానికి జూకి కొత్త‌గా తెచ్చిన మ‌గ సింహం న‌బాకు ఘ‌నంగా ఈ పెళ్లిని జ‌రిపించారు అధికారులు. ఈ పెళ్లి సంద‌ర్భంగా సింహాల కోసం ప్రత్యేకంగా మాంసం కేకును తయారు చేశారు. ఈ కేక్ లో బీఫ్ స‌హా ఇత‌ర మాంసాహారాల‌ను ఉప‌యోగించారు. ఇకపై ఈ సింహాలను మిగతావాటితో కాకుండా వేరే బోనులో ఉంచుతారు. జిమ్ వాతావ‌ర‌ణంలో పూర్తిగా మార్పులు తెచ్చేందుకూ, జంతువుల్లోని ఒంట‌రిత‌నాన్ని దూరం చేసేందుకు ఇలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు జూ అధికారులు ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. మృగ‌రాజు పెళ్లా మ‌జాకా!

Loading...

Leave a Reply

*