2 నెల‌ల్లో 10 కేజీలు కొవ్వు క‌రిగించారు… ఈజీ ప‌ద్ద‌తిలో..!

fat-mens

ప్రస్తుతం ఊబ‌కాయం స‌మ‌స్య ప్ర‌పంచానికి స‌వాల్‌గా మారింది. ఇది ప‌లు ర‌కాల స‌మ‌స్య‌ల‌కు దారితీస్తోంది. దీంతో, స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకునేందుకు కొందరు వైద్యులను ఆశ్రయిస్తుంటే మరికొందరు రోజువారీ వ్యాయామాలు, చిట్కాలను పాటిస్తూ బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చైనాలోని వైద్యులు మాత్రం ఓ సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టి ఓ వ్యక్తి బరువును రెండు నెలల్లో ఏకంగా 10కేజీలు తగ్గించి రికార్డు సృష్టించారు.

బీజింగ్‌కు చెందిన లీ కన్ 80 కేజీల బరువుతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. వైద్యుల వద్దకు వెళితే బరువు తగ్గాలని సూచించారు. ఆయన చేసిన ప్రయత్నాలన్నీవిఫలమయ్యాయి. చెంగ్డులోని సెకండ్ పీపుల్స్ ఆస్పత్రి సరికొత్త విధానం ద్వారా అతడి బరువును తగ్గించేందుకు ప్రయత్నించి విజయం సాధించింది. లీ కన్ పొట్టలోని ధమనిని బ్లాక్ చేయడం ద్వారా ‘హంగర్ హార్మోన్’ను పస్తులుంచారు. ఈ పద్ధతి విజయవంతం కావడంతో లీకన్ రెండు నెలల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా పది కిలోల బరువు తగ్గాడు.

లీకన్ పొట్టలోని ధమనిని గెలటిన్(జిగురు పదార్థము)ను ఉపయోగించి మూసివేశారు. ఈ విధానం గ్యాస్ట్రిక్ ఆపరేషన్ కంటే సులభమైనదే కాక రక్తస్రావం కాకుండా, ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుందని చైనా ప్ర‌భుత్వ ప‌త్రిక తెలిపింది. ధమనులను బ్లాక్ చేయడం వల్ల ఆకలిని కలిగించే హార్మోన్ల విడుదల తగ్గిపోతుంది. ఫలితంగా ఎప్పుడూ కడుపు నిండుగా ఉన్నట్టే అనిపిస్తుంది. లీ ఈ విధానం ద్వారానే పది కేజీల బరువు తగ్గగలినట్టు ఆస్పత్రి ఇంటర్‌వెన్షన్ థెరపీ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ చీఫ్ రెన్ యీ తెలిపారు. ఇదే విధానాన్ని గతేడాది అమెరికాలోని జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్సిటీలో పరీక్షించారు. ఈ విధానం ద్వారా శరీర బరువులో పదిశాతం తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ విధానం అందరికీ సరిపడదని రెన్ హెచ్చరించారు. అధికంగా తినడం ద్వారా బరువు పెరిగి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికే ఈ చికిత్సా విధానం సరిపోతుందని తెలిపారు.

Loading...

Leave a Reply

*