లారెన్స్‌కి 15 కోట్లు బొక్క పెట్టిన క్లోజ్ ఫ్రెండ్‌…?

raghava-larance

మనసు మాట వినొద్దు.. మనిషి మాట అస్సలు వినొద్దు.. ఏది అనిపిస్తే అది చేసేయ్.. నీకంటే తోపు ఎవడూ లేడిక్కడ.. బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ ఎగ్రెసివ్ గా చెప్పిన ఈ డైలాగుల్ని లారెన్స్ విన్నట్టు లేదు. విన్నా కూడా లైట్ తీసుకొని ఉంటాడు. అందుకేనేమో ఫ్రెండ్ మాట విన్నాడు.. 15 కోట్లు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదే టాపిక్ వేడివేడిగా రౌండ్స్ కొడుతోంది…

విషయం ఏంటంటే… లారెన్స్ ఈమధ్య బాగానే సంపాదించాడు. వచ్చిన డబ్బును రొటేట్ చేసినప్పుడే కాదు.. అది ఇంకాస్త పెరుగుతుంది. లారెన్స్ కూడా అలానే చేయాలనుకున్నాడు. సరిగ్గా ఇక్కడే ఓ స్నేహితుడి మాట విన్నాడు. అతడి మాట నమ్మి చెన్నై, మధురై లాంటి నగరాల్లో 15 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాడు. ఇవన్నీ టెక్స్ టైల్, మార్బుల్స్ రంగంలో పెట్టుబడులుగా తెలుస్తోంది.

మొదట బాగానే లాభాలు వచ్చాయట. ప్రాఫిట్ వచ్చినందుకు ఫ్రెండ్ కు పార్టీ కూడా ఇచ్చాడట. కానీ కట్ చేస్తే ఇప్పుడు లారెన్స్ కు ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయిందట. కళ్లమూసి తెరిచేలోపు 15 కోట్లు హారతి కర్పూరంలా కరిగిపోయాయట. దీంతో తిరిగి డబ్బు సంపాదించేందుకు కొత్త కొత్త ప్రాజెక్టులు ఎనౌన్స్ చేస్తున్నాడు లారెన్స్. ఈసారి సంపాదించిన డబ్బు ఎక్కడ పెడతాడో చూడాలి. ఈ సినిమావాళ్లంతా ఇంతేనేమో..

Loading...

Leave a Reply

*