అనుష్క‌ను మ‌ర్చిపోయిన కోహ్లీ

kohli-and-anushka

విరాట్ కోహ్లీ… టీమిండియా కెప్టెన్‌.. క్రికెట్ ప్రపంచంలో వీరాధివీరుడు…. బ్యాట్ ప‌ట్టుకుని దిగితే ప్ర‌త్య‌ర్థుల బౌలింగ్‌ను ఊచ‌కోత కోస్తాడు… అయితే అలాంటివాడు ఈమ‌ధ్య త‌ర‌చు ఫెయిల్ అవుతున్నాడు.. ట‌న్నులు ట‌న్నుల ర‌న్నులు చేసేవాడు… త‌క్కువ స్కోర్‌కే పెవిలియ‌న్ బాట ప‌డుతున్నాడు… బ్యాట్ ప‌ట్టుకుని వెళ్లినంతసేపు ప‌ట్ట‌డం లేదు వెన‌క్కి తిరిగి రావ‌డానికి… దీనికంత‌టికి కార‌ణం అనుష్కే అని ఆక్రోశిస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్… మ‌నోడు ఇలా అయిపోవ‌డానికి కార‌ణం ఆ అందాల రాక్ష‌సే అని ఆగ్ర‌హిస్తున్నారు…. ఆ బ్యూటీ వ‌ల‌లో ప‌డి డ్యూటీ మ‌ర్చిపోయా డంటూ సెటైర్లు వేస్తున్నారు.. క్రికెట్ పిచ్‌ను మ‌ర్చిపోయి ప్రేమ‌పిచ్చిలో మునిగిపోయిన కోహ్లీ ఆట‌పై కాన్సంట్రేట్ చేయ‌లేక‌పోతున్నాడు….. అనుష్క‌తో బ్రేక‌ప్ అయ్యేస‌రికి కోహ్లీ బ్యాట్ షేక్ అయి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు…అనుష్క‌తో బ్రేక‌ప్ కోహ్లీ బ్యాటింగ్‌పై తీవ్ర ప్ర‌భావం చూపిం చింది.. ప‌రుగులు తీయ‌డం మ‌ర్చిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నాడు కోహ్లీ…

దీంతో అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు… అయితే తాజాగా కోహ్లీ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు… చిత‌క్కొట్టుడు కొట్టాడు.. సెంచ‌రీతో చెల‌రేగిపోయాడు.. దీంతో అభిమానులు ఆనందంతో పండ‌గ చేసుకుంటు న్నారు…. నిన్న‌టిదాకా ప్రేమపిచ్చిలో మునిగితేలిన కోహ్లీ ఇప్పుడు క్రికెట్‌లో మునిగి తేలుతున్నాడంటూ ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు… కోహ్లీ మ‌ళ్లీ ఫామ్‌లోకి రావ‌డానికి కార‌ణం ఏంట‌య్యా అంటే అనుష్క‌ను త‌న మ‌ది గ‌ది నుంచి ఖాళీ చేయించాట్ట కోహ్లీ… దేవ‌దాసులా అనుష్క‌ను త‌ల్చుకుంటూ విషాద గీతాలు పాడుకుంటూ కూర్చోకుండా ఏయ్ పిల్లా చావ‌వే.. పోతే పోవే అని మ‌న‌సు దిట‌వు చేసుకుని గుండెనిబ్బ‌రంతో మ‌ళ్లీ త‌నకు ఇష్ట‌మైన క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాట్ట‌…

గుండెల నిండా గాలి పీల్చుకుని త‌న గాల్‌ఫ్రెండ్‌కి గ‌ట్టిగా గుడ్‌బై చెప్పేసి అనుష్క‌ను ఎలాగోలా మ‌ర్చిపోయిన కోహ్లీ ఆట‌లో మ‌ళ్లీ తాట తీస్తున్నాడని ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈసారిమళ్లీ వ‌చ్చి మావాడ్ని ఆడుకోకే, వాడ్ని క్రికెట్ ఆడ‌నివ్వ‌వే అంటూ కోహ్లీ ఫ్యాన్స్ అనుష్క‌ను వేడుకుంటున్నారు.

Loading...

Leave a Reply

*