ఫేస్‌బుక్‌లో 200 మంది యువ‌కుల జీవితాల‌తో ఆట.. ఈ వ‌గ‌లాడిపై దేశ‌వ్యాప్తంగా 100 కేసులు..!

kushboo-sharma

ఇదో విచిత్ర‌మైన స్టోరీ. ఇన్నాళ్లూ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ అయిన వారి లిస్ట్‌లో ఎక్కువగా బాధితుల లిస్ట్‌లో అమ్మాయిలే ఉన్నారు. వారిని భ‌య‌పెట్టి, బ‌తిమాలి, కాళ్లా వేళ్లా ప‌డి.. అమ్మాయిల‌ను ట్రాప్‌లో ప‌డేసే వారే ఎక్కువ‌. వారి నుంచే ఎక్కువ‌గా కంప్ల‌యింట్‌లు వ‌స్తుంటాయి. కానీ, ఇది పూర్తిగా రివ‌ర్స్ కేస్‌.

త‌న అందాన్ని ఎర‌గా వేసి ఒకేసారి ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఏడెనిమిది నుంచి ల‌క్ష‌లు కాజేస్తున్న అమ్మాయి స్టోరీ ఇది. ఈమె పేరు కుష్‌బూ శ‌ర్మ‌. రాజ‌స్థాన్‌కి చెందిన ఈ యువ‌తి ఇప్పుడు సోష‌ల్ మీడియాతో యువ‌కుల‌ను ట్రాప్ చేస్తోంది. ఫేస్‌బుక్‌లో అబ్బాయిల‌కి లైక్ పెట్ట‌డం, వారితో మాట‌లు క‌ల‌ప‌డం, వీల‌యితే క‌లిసి వారితో ఫోటోలు దిగ‌డం ఇదీ ఆమె ప‌ని. వీల‌యితే నాలుగు మాట‌లు.. కుదిరితే క‌ప్పు కాఫీ అంటూ మొద‌లుపెట్టి అబ్బాయిల‌ను వ‌ల‌లో వేసుకుంటుంది. అంద‌మైన అమ్మాయి క‌దా అని టెంప్ట్ అయ్యారో అంతే సంగ‌తులు.

ముందుగా సెల్ఫీలు దిగడం, ర‌క‌ర‌కాల లొకేష‌న్‌లు, విభిన్న భంగిమ‌లు.. క్లోజ్‌గా మూవ్ అయిన‌ట్లు సెల్ఫీలు, షికార్‌లు ఆ త‌ర్వాతే అస‌లు హ‌డావిడి ష‌రూ అవుతుంది. వారిని బెదిరించి డ‌బ్బులు అడుగుతుంది. లేదంటే ఫోటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చెయ్య‌డం..అంతే, అత‌గాడి ఔట్‌. ఇలా, ఫోటోలు పోస్ట్ చెయ్య‌కుండా ఉండాలంటే ల‌క్ష‌ల్లో డిమాండ్ చేస్తుంది. దెబ్బ‌కు అయ్య‌గారు దిగివ‌స్తార‌ట‌. అమ్మ‌గారు అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇచ్చుకుని ఫోటోలు డిలీట్ చేయించుకొని బ‌య‌ల్దేరుతాడ‌ట‌. తోక జాడిస్తే.. అమ్మగారితోక‌లిసి ఎక్క‌డెక్క‌డో దిగిన ఫోటోల‌ను షేర్ చేస్తానంటూ బెదిరించ‌డం.. ఇదీ తతంగం.

కుష్ బూ బాధితులు.. ఏపీ, తెలంగాణ,క‌ర్నాట‌క‌, మ‌హ‌రాష్ట్ర‌, రాజ‌స్తాన్‌లో ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల‌లో క‌లిసి ఆమెపై వంద‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి అంటే ఆమె బాదుడు ఏ రేంజ్‌లో ఉన్నాయో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బెంగ‌ళూరుకు చెందిన ఓ బిగ్ షాట్ లాయ‌ర్‌ని కూడా ఇలాగే ట్రాప్ చెయ్య‌బోయింద‌ట‌. ఫేస్‌బుక్‌లో ప‌రిచయం పెంచుకొని.. ఆఫీసు విషయం మాట్లాడటానికని అతని ఇంటికి వెళ్లి, రూ.1.75 లక్షల నగదు, ఐఫోన్‌తో పారిపోయింది. కొన్ని రోజుల అనంతరం మళ్లీ న్యాయవాదికి ఫోన్ చేయడంతో పోలీసులు పట్టుకున్నారు.

Loading...

Leave a Reply

*