జియో వినియోగ‌దారుల‌కు షాక్‌

jio

అప‌రిమిత 4జీ ట్ వినియోగం… అవ‌ధుల్లేకుండా కాల్స్ మాట్లాడుకునే సౌల‌భ్యం అంటూ రిల‌య‌న్స్ జీయో సృష్టించిన‌ సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. పోటీ కంపెనీల‌కు త‌న ఆఫ‌ర్ల‌తో చుక్క‌లు చూపించింది. ఇప్పుడు సొంత వినియోగ‌దారుల‌కూ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. జియో సిమ్ వాడుతున్న వినియోగ‌దారులు త‌క్ష‌ణం త‌మ వివ‌రాలు అప్‌డేట్ చేయ‌కుంటే సేవ‌లు నిలిపివేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. జియో సిమ్ వాడుతున్న క‌స్ట‌మ‌ర్ల మొబైల్స్‌కు ఒక ఎస్సెమ్మెస్ వ‌స్తుంది. దానికి స్పందించి అందులో కోరిన వివ‌రాల‌ను త‌క్ష‌ణ‌మే వినియోగ‌దారులు కంపెనీకి పంపాల్సి ఉంటుంది. అలా పంప‌కుండా ఏమ‌వుతుందిలే అని తాత్సారం చేస్తే ఇక మీ అప‌రిమిత ఆనందానికి బ్రేకులు ప‌డిన‌ట్లే.

రెండు నెల‌ల నుంచి ఉచితంగా పొందుతున్న సంతోషానికి చెక్‌ప‌డిన‌ట్లే. కంపెనీ నుంచి వ‌చ్చిన ఆ ఎస్సెమ్మెస్ సారాంశం ఏమిటంటే… త‌క్ష‌ణం మీ సమీపంలోని రిల‌య‌న్స్ స్టోర్‌కు వెళ్లి మీ వేలిముద్ర‌లు అక్క‌డున్న ప‌రిక‌రంపై అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయ‌కుండా ఫింగ‌ర్‌ప్రింట్ ఇవ్వ‌డం ఇష్టం లేకుంటే ఇక‌పై మీకు ఉచిత సేవ‌ల‌ను అందించ‌డానికి జియో కూడా సిద్ధంగా లేదు. ఇప్ప‌టికే మెసేజ్ వ‌చ్చిన వారు ఇంకా ఆల‌స్యం చేస్తే ఏ క్ష‌ణ‌మైనా జియో సేవ‌లు నిలిచిపోయే అవ‌కాశం ఉంది.

Loading...

Leave a Reply

*