ప‌వ‌న్ ప్లాన్‌కి జ‌యల‌లిత దెబ్బ‌..!

jayalalitha-ill-health-disrupts-pavan-katamarayudu-plan

ప‌వ‌న్ ఫిక్స్ చేసుకున్న ప్లాన్‌కి జ‌య‌లలిత రూపంలో ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఆయ‌న లేటెస్ట్ మూవీ కాట‌మ‌రాయుడు ఆల‌స్యం అయింది. ఎప్పుడో సెట్స్‌పైకి రావాల్సిన ఈ చిత్రం రెండు నెలలు ఆల‌స్యంగా మొద‌ల‌యింది. దీంతో, వేగంగా ఫినిష్‌ చేద్దామ‌ని సినిమా షూటింగ్‌ని ప‌క్కాగా ప్లాన్ చేశారు. కథ ప‌రంగా కొంత పార్ట్‌ని త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రంలో తీద్దామ‌ని భావించారు ద‌ర్శ‌కనిర్మాత‌లు. ఇప్ప‌టికే అక్క‌డ లొకేషన్‌లు కూడా చూసి వ‌చ్చారు. ఈ మంత్ సెకండ్ వీక్‌లో అక్క‌డ షూటింగ్‌కి బ‌య‌ల్దేరామ‌ని ముహూర్తం చూస్తుండ‌గా, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేర‌డంతో కాట‌మ‌రాయుడు షూటింగ్‌ని వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింద‌ట‌.

నిన్న‌మొన్న‌టిదాకా జ‌య‌ల‌లిత ఆరోగ్యంపై ర‌క‌ర‌కాల వ‌దంతులు వినిపించాయి. దీంతో, త‌మిళ‌నాట గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో అక్క‌డ షూటింగ్ చెయ్య‌డం మంచిదికాద‌ని భావించిన కాట‌మ‌రాయుడు సినిమా యూనిట్‌.. రామేశ్వ‌రం లొకేష‌న్‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ ప్లాన్ చేసిని షూటింగ్‌ని మ‌రో లొకేష‌న్‌కి షిఫ్ట్ చేస్తే మంచిద‌నే భావ‌న‌లో ఉంది చిత్ర యూనిట్‌. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు డాలీ, నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ఈ ప‌నిలోనే బిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం.

స‌ర్దార్ గబ్బ‌ర్‌సింగ్ ఫ్లాప్ కావ‌డంతో కాట‌మ‌రాయుడిపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు ప‌వ‌న్ అభిమానులు. ఫ్యాక్ష‌నిజం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్క‌తోన్న ల‌వ్ స్టోరీ ఇది. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఇటీవ‌ల తారాగ‌ణం ఎంపిక కూడా పూర్త‌యింది. దీంతో, సినిమా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంద‌ని భావించిన ఫ్యాన్స్‌కి జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రి పాల‌వ‌డంతో మ‌రికాస్త వెయిట్ చెయ్య‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.. స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ సినిమా విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు.

 

Loading...

Leave a Reply

*