అయోమయంలో జనతా..మధ్యలో కొరటాల

jana

జనతా గ్యారేజ్ దూసుకుపోతోంది. టాలీవుడ్ చరిత్రలోనే టాప్-3 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు… రేపోమాపో ఇది టాప్-2లోకి ఎంటరైనా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఇక్కడే జనతా గ్యారేజ్ అయోమయంలో పడింది. అటు కొరటాల కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. వరుసగా రికార్డులు సృష్టిస్తున్న జనతా గ్యారేజ్ అయోమయంలో పడ్డానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.ప్రస్తుతం టాలీవుడ్ టాప్-1లో బాహుబలి సినిమా ఉంది. ఈ సినిమా వసూళ్లను అందుకోవడం ప్రస్తుతానికి అసాధ్యం. ఈ విషయం అందరికీ తెలుసు. ఇక టాప్-2లో మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా ఉంది. ఈ సినిమా దాదాపు 80కోట్ల వసూళ్లు సాధించి.. బాహుబలి తర్వాత ఆల్ టైం హిట్ అనిపించుకున్న మూవీగా నిలిచింది.

ఇక మూడో స్థానంలో మొన్నటివరకు అత్తారింటికి దారేది ఉంటే, ఆ స్థానాన్ని జనతా గ్యారేజ్ అధిగమించింది.ప్రస్తుతం జనతా గ్యారేజ్ వసూళ్లను 77కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. మరో 3కోట్లు ఆర్జిస్తే, అది శ్రీమంతుడ్ని క్రాస్ చేసినట్టే. అది ఆ 3 కోట్లు లెక్క చూపించి, శ్రీమంతుడ్ని క్రాస్ చేసినట్టు చూపిస్తే…. మహేష్ ఫ్యాన్స్ రచ్చ చేసే అవకాశం ఉందని జనతా గ్యారేజ్ యూనిట్ భయపడుతోంది. సో… టాప్-3గానే జనతాను ఉంచేద్దామా… లేక ఫ్యాన్స్ కోరిక మేరకు ఆ 3 కోట్లు కలిపి శ్రీమంతుడ్ని క్రాస్ చేసినట్టు చూపిద్దామా అనే గందరగోళంలో సినిమా పడిపోయింది. మరోవైపు తన నెక్ట్స్ సినిమాను మళ్లీ మహేష్ తోనే చేయాల్సి రావడంతో అటు కొరటాల శివ కూడా ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీకెండ్ నాటికి టాప్-2 ఏంటనేది తేలిపోతుంది. అప్పటివరకు ఈ అయోమయం తప్పదు.

Loading...

Leave a Reply

*