మ‌రోసారి పేలిన జేసీ తూటా!

jc

సంచ‌ల‌న విమ‌ర్శ‌ల‌కు పెట్టింది పేరు జేసీ దివాక‌ర్ రెడ్డి. ఏ పార్టీలో ఉన్నా… ఏ ప‌దవిలో ఉన్నా జేసీ చేసే వ్యాఖ్య‌లు ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. తాజాగా దేశ‌వ్యాప్తంగా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌పై జేసీ త‌న స‌హ‌జ‌ధోర‌ణిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీని నిలువునా ముంచిన మోడీని ఎలా న‌మ్మాలని జేసీ ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పింది మోడీయేన‌ని, ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా మోడీ ఇదే విష‌యాన్ని ఏపీలోని ప‌లు స‌భ‌ల‌లో ప్ర‌క‌టించార‌ని అలాంటి వ్య‌క్తి చివ‌ర‌కు ఆ హోదా ఇవ్వ‌కుండా మోసానికి పాల్ప‌డ‌లేదా? అని జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. అలాగే ఇప్పుడు ఆయ‌న చెబుతున్న స‌ర్జిక‌ల్ దాడుల‌కు సంబంధించి కూడా అనుమానాలు వ్య‌క్తం కావ‌డం వింతేమీ కాద‌ని జేసీ వ్యాఖ్యానించారు. ఇదే కాద‌ని, ఎన్నిక‌ల‌లో చెప్పిన ప‌లు హామీల విష‌యంలో మోడీ ఆ త‌ర్వాత కాడి పారేశార‌ని జేసీ చెప్పారు. అందువ‌ల్ల ఆర్మీ ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌కూడ‌దు కాబ‌ట్టి… మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్‌, మాజీ ర‌క్ష‌ణ మంత్రులు ఇలా ఒక‌రిద్ద‌రి ఆ దాడుల వీడియోలు ర‌హ‌స్యంగా చూపిస్తే స‌రిపోతుంద‌ని దానివల్ల ర‌హ‌స్యం ర‌హ‌స్యంగానే ఉంటుందని జేసీ సూచించారు. అలా వీడియోలు చూసిన‌వారు వ‌చ్చి నిజ‌మేన‌ని మీడియాకు చెబితే స‌రిపోతుంద‌ని జేసీ తెలిపారు. మోడీపై జేసీ విమ‌ర్శ‌లు చేసినా ఓ మంచి స‌ల‌హానే ఇచ్చార‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది.

Loading...

Leave a Reply

*