రూ. 16కే ఇంట‌ర్‌నెట్‌… బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌

untitled-16

16 రూపాయల‌కే ఇంట‌ర్‌నెట్ వ‌స్తుందా? కొద్దికాలం క్రితం ఆ మాట ఎవ‌రైనా చెబితే నోటితో న‌వ్వేవాళ్లు కాదు… అలా చెప్పిన వాడ్ని చూసి పిచ్చోడు అనుకునేవాళ్లు… అయితే ఇప్పుడు కాలం మారింది… ఇది ఉచిత స‌మ‌యం… ఆఫ‌ర్ల సీజ‌న్‌… ఒక‌టి కొంటే ఒక‌టి ఫ్రీ కాదు… ఏది కొన‌కుండానే అన్ని ఫ్రీ…. జియో దెబ్బ‌కు మిగిలిన నెట్‌వ‌ర్క్‌లు దిగివ‌చ్చాయి.. మ‌రీ ముఖ్యంగా ఎయిర్‌టెల్‌, బీఎస్ఎన్ఎల్ ఆఫ‌ర్ల‌తో హోరెత్తిస్తున్నాయి… ఎస్ఎంఎస్ ఇస్తే 1.2 జీబీ డేటా ఫ్రీ అంటూ బిత్త‌ర‌పోయే ఆఫ‌ర్‌ని ఎయిర్‌టెల్ ఇస్తే అంత‌కంటే త‌త్త‌ర‌పుట్టించే ఆఫ‌ర్‌ని బీఎస్ఎన్ఎల్ ఇస్తోంది… 16 రూపాయ‌లు.. జ‌స్ట్ 16 రూపాయ‌ల‌కే ఇంట‌ర్‌నెట్‌ అందిస్తోంది… ఈ 16 రూపాయ‌ల స్కీమ్ భార‌తీయ టెలికం రంగంలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది… మిగిలిన నెట్‌వ‌ర్క్‌ల‌లో క‌ల‌క‌లం రేపి క‌ల‌వ‌రం పుట్టిస్తోంది…అస‌లు 16 రూపాయల‌కు ఏం వ‌స్తుంది అంటే గ‌బుక్కున చెప్ప‌లేం…16 రూపాయ‌ల‌కు ప్లేటు ఇడ్లీ కూడా రాదు… బీఎస్ఎన్ఎల్ 16 ఏళ్ల పండ‌గ సంద‌ర్భంగా ఈ బంపర్ ఆఫ‌ర్ డేటా ప్లాన్ ప్ర‌క‌టించింది….

త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం ఇలా అదిరిపోయే ఆఫ‌ర్‌ను అందిస్తోంది… 16 రూపాయ‌ల‌కే డేటా ప్లాన్ అందుబాటులోకి వ‌స్తుంది…అక్టోబ‌ర్ 7 నుంచి అక్టోబ‌ర్ 31 దాకా ఈ టారిఫ్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది….ఆ లోప‌లే ఈ ప్లాన్‌ని కొనుక్కోవాలి.. ఆ త‌ర్వాత ఆఫ‌ర్ పీరియ‌డ్ అయిపోతుంద‌ని బీఎస్ఎన్ఎల్ వ‌ర్గాలు చెబుతున్నాయి.. డిజిట‌ల్ ఇండియాలో భాగంగా ఇండియాలోని యూజ‌ర్లంద‌రికి ఇంట‌ర్నెట్ అందుబాటులోకి రావాల‌ని బీఎస్ఎన్ఎల్ ఈ బంప‌ర ఆఫ‌ర్ ప్ర‌క‌టిస్తోంది… అంతేకాకుండా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి 2జీ, 3జీ ప్లాన్ల‌కు సంబంధించి అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన టారిఫ్ ప్లాన్ల‌ను లాంచ్ చేస్తామ‌ని బీఎస్ఎన్ఎల్ వ‌ర్గాలు చెబుతున్నాయి…

బీఎస్ఎన్ఎల్ 16 రూపాయ‌ల డేటా ప్లాన్‌తో ఇండియాలో ఇంటింటికి ఇంట‌ర్‌నెట్ రావ‌డం ఖాయం… ఆఖ‌రికి రిక్షావాలాకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది… అత్యంత పేద‌వాడికి కూడా ఇది అందుబాటులోకి వ‌స్తుంది.. బీఎస్ఎన్ఎల్ ఇస్తున్న ఈ భారీ ఆఫ‌ర్‌కి జ‌నం జ‌య‌హో అంటున్నారు. బీఎస్ఎన్ఎల్ డేటాగిరికి జ‌నం గులాంగిరి చేస్తున్నారు.

Loading...

Leave a Reply

*