ఈ నెంబ‌ర్ నుండి కాల్ వ‌స్తే ఎత్త‌కండి.. ఇండియ‌న్ ఆర్మీ వార్నింగ్‌..!

indian army

భారత్‌-పాక్ మ‌ధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ‌తిన్నాయి. ఉరీ ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా మేల్కొన్న భార‌త్‌.. పాక్‌పై స‌ర్జిక‌ల్ దాడులు మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికే ప‌లు ఉగ్ర‌వాద సంస్థ‌లపైన స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ నిర్వ‌హించింది. అటు పాక్ కూడా భార‌త్‌ను రెచ్చ‌కొడుతూ స‌రిహ‌ద్దు వెంట క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. దీనిని మ‌న భ‌ద్రతాద‌ళాలు తిప్పికొడుతున్నాయి. ఇప్ప‌టికే 38మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టింది భార‌త సైన్యం.

దీంతో ప‌గ‌తో ర‌గిలిపోతున్న పాక్‌.. కొత్త‌గా ప‌రోక్ష యుద్ధానికి పాల్ప‌డుతోంది. సోష‌ల్ మీడియాని, సెల్‌ఫోన్ల‌ను టార్గెట్ చేస్తోంది. ఇప్ప‌టికే, భార‌త యువ‌త‌ను త‌ప్పుదారి ప‌ట్టించేలా కొన్ని వేల ఫేస్‌బుక్‌, వాట్స‌ప్ పోస్ట్‌ల‌ను మన‌పై రుద్దే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ట‌. అవి ఇప్ప‌టికే మ‌న సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయ‌ని ఇంటిలెజిన్స్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, అటు భార‌త నిఘా విభాగం కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండి వాటిని ముందే నిర్వీర్యం కూడా చేస్తోంద‌ట‌. ఇలాంటి మెస్సేజ్‌ల‌కు స్పందించ‌వ‌ద్ద‌ని భార‌త ఆర్మీ ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు కూడా పంపింది. దీనిపై మ‌న యువ‌త జాగ్ర‌త్త‌గా ఉండ‌గానే తాజాగా మ‌రో కొత్త వార్‌కి తెర‌లేపింది పాక్‌.

సోష‌ల్ మీడియాపై పాక్ ప‌న్నాగాల‌కు భార‌త ఆర్మీ దారులు మూసేయ‌డంతో.. పాక్ కొత్త కుట్ర‌కు తెర‌దీసింది. పాక్ హ్యాక‌ర్‌లు ఇప్పుడు ఏకంగా ఫోన్‌ల ద్వారా త‌మ‌కు కావాల్సిన స‌మాచారాన్ని రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చే్స్తున్నారు. దీంతో, +92 నెంబ‌ర్‌తో షురూ అయ్యే సిరీస్ నుంచి ఫోన్‌లు వ‌స్తే.. కాల్ ఎత్త‌వ‌ద్ద‌ని భార‌త ఆర్మీ సూచించింది. +92 లేదా 0092 అనేది పాక్ ఐఎస్‌డీ కోడ్‌. అందుకే, ఆ నెంబ‌ర్‌తో మొద‌ల‌య్యే సిరీస్ నుంచి ఫోన్‌లు వ‌స్తే కాల్ క‌ట్ చెయ్యాల‌ని, లేదంటే.. మ‌న ఫోన్‌ని హ్యాక్ చేసి, వారికి కావాల్సిన స‌మాచారాన్ని త‌స్క‌రించే అవ‌కాశాన్ని వారికి లేకుండా చెయ్యాల‌ని భార‌త ఆర్మీ హెచ్చ‌రిక‌లు పంపుతోంది. మ‌రి, మీరు కూడా కొన్ని రోజులు మీకు వ‌చ్చే ఇన్‌క‌మింగ్ కాల్స్‌పై కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి

Loading...

Leave a Reply

*