భార‌త్ పాక్ వార్ ఆ జంట పెళ్లికొచ్చింది

pak-and-ind

ఉరీ దాడులు భార‌త్ – పాకిస్థాన్‌ల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణాన్ని తెచ్చాయి. ఇరు దేశాధినేత‌లు వ్యూహప్ర‌తివ్యూహాల్లో ఉన్నారు. ఇరు దేశాల సైనికులు ఎవ‌రికి వారు త‌మ ప్ర‌తాపాన్ని చూపాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ద‌శ‌లో భార‌త ఆర్మీ ఒక అడుగు ముందుకేసి పాక్‌కు మ‌న స‌త్తా ఏమిటో చూపింది. అయితే, ఇదంతా ఒక జంటకి పెళ్లి క‌ష్టాలు తెచ్చి పెట్టింది. ఉద్రిక్త‌త‌ల‌తో స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు త‌ట్టాబుట్టా స‌ర్దుకుని ప్రాణాల‌ను కాపాడుకునేందుకు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి పోయారు. అయితే, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన న‌రేష్ తెక్వానికి పాకిస్థాన్‌లోని సింధూ ప్రావిన్స్‌కు చెందిన ప్రియా బ‌దానీకి కొన్నాళ్ల క్రితం పెళ్లి కుదిరింది. వీరి పెళ్లి భార‌త్లో చేయాల‌నుకున్నారు. దానికి వధువు త‌ర‌ఫు వాళ్లు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. భార‌త్ వ‌చ్చేందుకు వీసా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. న‌వంబ‌ర్ ఎనిమిదిన జ‌ర‌గాల్సిన ఈ పెళ్లికి ఇప్పుడు ఇరు దేశాల ఉద్రిక్త‌త‌లు అడ్డుగా నిలిచాయ‌. పెళ్లి గ‌డియ‌లు స‌మీపిస్తున్నా వ‌ధువు, ఆమె త‌ర‌ఫు బంధువుల వీసాల‌కు భార‌త్ అధికారులు క్లియ‌రెన్స్ ఇవ్వ‌లేదు. దాంతో ఇప్పుడు వారి పెళ్లి జ‌ర‌గ‌నుందా… లేక వాయిదా ప‌డ‌నుందా అన్న‌ది అర్థం కాని ప‌రిస్థితి. కొస‌మెరుపు ఏమిటంటే…. 1999లోనూ ఇలాగే ఉద్రిక్త‌త‌లు ఏర్ప‌డిన స‌మ‌యంలో ఈ రెండు కుటుంబాల‌లో జ‌ర‌గాల్సిన ఒక వివాహం రెండేళ్లు వాయిదా ప‌డింద‌ట‌.

Loading...

Leave a Reply

*