4 రోజుల్లో బ్యాంక్‌ల‌కు ఎంత మ‌నీ చేరిందో తెలుసా…?

banks

నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌కు రావ‌డం మొద‌లైంది. పుట్ట‌ల్లోంచి పాములు బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు కోట్ట క‌ట్ట‌లు దుమ్ము దులుపుకుని బ్యాంకుల బాట ప‌డుతున్నాయి. ఐదు రోజుల క్రితం రాత్రి మోడీ చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న న‌ల్ల‌ధ‌నం దాచుకున్న వాళ్ల‌లో గుబులు రేపింది. అప్ప‌టిక‌ప్పుడు రంగంలోకి దిగి కొంత మ‌నీని వైట్ చేసుకున్న వాళ్లూ కొంద‌రున్నారు. చాలామంది… త‌మ వ‌ద్ద ప‌నిచేసే వారికి, తెలిసిన వారికి ల‌క్ష‌ల్లో డ‌బ్బులిచ్చి బ్యాంకుల్లో వేయించుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ గుంటూరులో ఒక హోట‌ల్ య‌జ‌మాని త‌న‌వద్ద ప‌నిచేసే 40 మందికి తలా కొంత ఇచ్చి బ్యాంకుకు పంపి వారి పేరుతోనే ఖాతాలు తీయించిన ఉదంతం.

ఇలా హైద‌రాబాద్‌కు చెందిన పారిశ్రామిక‌వేత్త ఒక‌రు త‌మ సంస్థ‌లోని ఉద్యోగులంద‌రి ఖాతాల్లోకి కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌లు బ‌దిలీ చేసిన వార్త కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇలా ఎవ‌రికి తోచిన ప‌ద్ధ‌తిలో వారు బ‌య‌ట‌కు తెస్తున్న క్యాష్ నాలుగు రోజుల్లోనే మూడు ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింద‌ని తాజా సమాచారం. అంటే ఇదే ప‌ద్ధ‌తిలో బ్యాంకుల‌లో క్యాష్ జ‌మ అవుతుంటే… చివ‌రి గ‌డువైన డిసెంబ‌ర్ 31 నాటికి అది ఎన్ని ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుతుందో మ‌రి. జ‌నం ఇబ్బందులు ప‌క్క‌న పెడితే నోట్ల ర‌ద్దుతో ఒక్క‌సారిగా ల‌క్ష‌ల కోట్ల ధ‌నం బ్యాంకుల‌కు చేరుతోంది. దీనివ‌ల్ల బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు విస్తృత‌మ‌వుతాయ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రుణాల ల‌భ్య‌త పెరుగుతుంద‌ని, త‌ద్వారా వ్య‌వ‌సాయ‌, పారిశ్రామిక వృద్ధి పెరుగుతుంద‌ని అంతిమంగా అది ఉపాధి అవ‌కాశ‌ల పెంపున‌కు దారి తీస్తుంద‌ని వెర‌శి భార‌త్ మ‌రింత శ‌క్తిమంత‌మైన దేశంగా అవ‌త‌రించ‌డానికి దోహ‌ద‌ప‌డ‌డం ఖాయం అని వారు చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*