స్మార్ట్‌ఫోన్ ఉంటే సెక్స్ లైఫ్ ఉండ‌దు!

untitled-14

స్మార్ట్‌ఫోన్ వాడేవాళ్లు స్మార్ట్‌గా ఉంటార‌నుకుంటే పొర‌పాటే… స్మార్ట్ ఫోన్ వాడేవాడికి స్మార్ట్ లైఫ్‌ ఉండ‌దుట….. అంతా హార్డ్ లైఫే….స్మార్ట్‌ఫోన్‌తో సెక్స్ క‌రువ‌వుతుంది…బతుకు బ‌రువ‌వుతుందిట‌….ప‌క్క‌నే రంభ లాంటి వైఫ్ ఉన్నా సెక్స్ లైఫ్ ఉండ‌దు అని నిపుణుల ఉవాచ…సింపుల్‌గా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఇక శృంగార జీవితం లేకుండా చేస్తుంద‌ట‌… కొత్త‌గా పెళ్ల‌యినవాళ్లు ప‌గ‌లు రాత్రి అదే ప‌ని మీద ఉంటారు… శృంగారంలో మునిగితేలుతుంటారు… అయితే స్మార్ట్‌ఫోన్లు ధ‌రించిన పురుష‌పుంగ‌వులు ఎలా ఉంటారో ఓ సంస్థ తేల్చేసింది… వాళ్లు శృంగార జీవితం పక్క‌న‌పెట్టి రాత్రిపూట కూడా స్మార్ట్‌ఫోన్‌తో గ‌డిపేస్తున్నారుట‌… మ‌గాళ్లు మొగుళ్ల‌లా ఉండ‌కుండా మొద్దుల్లా మారిపోతున్నారుట‌… మొబైల్స్‌తోనే ముద్దుముచ్చ‌ట్లు…. సెల్‌తోనే స‌ర‌సాలు అన్న‌ట్టు గ‌డుపుతున్నారుట‌….

కేఆర్సీ అనే సంస్థ చేసిన స‌ర్వేలో ఈ నిర్ఘాంత‌పోయే నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయిట‌…. ఈ సంస్థ దేశంలోని 7 వేల‌మంది పురుషుల‌ను ప్ర‌శ్నించింది…. వాళ్ల‌ను వివిధ ప్ర‌శ్న‌లు అడిగి స‌మ‌గ్ర స‌ర్వే త‌యారు చేసింది… వాళ్లిచ్చిన స‌మాధానాల‌ను క్రోడీక‌రిస్తే అవాక్క‌య్యే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి… స్మార్ట్‌ఫోన్లు వాడే మ‌గ‌వాళ్ల‌లో నూటికి 74 శాతం రాత్రిపూట ప‌డుకున్న త‌ర్వాత కూడా స్మార్ట్‌ఫోన్‌ని వ‌ద‌ల‌ట్లేదుట‌….ఈ విష‌యంలో కొత్త‌గా పెళ్ల‌యిన మ‌గాళ్ల‌కు కూడా మిన‌హా యింపు లేదంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు….వాళ్లు త‌మ పార్ట్‌న‌ర్‌తో సెక్స్ జీవితాన్ని కూడా ప‌క్క‌న‌పెట్టి స్మార్ట్‌ఫోన్‌తోనే స‌ర‌సాలు ఆడుతున్నారుట‌. ఇంకొంత‌మంది అయితే డ్రైవింగ్ చేస్తూ కూడా ఫోన్ వ‌దిలిపెట్ట‌డం లేదు… స్మార్ట్‌ఫోన్ వ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో అన్ని అన‌ర్థాలు కూడా ఉన్నాయి. సో భ‌ర్త‌లూ… భ‌ద్రం బీకేర్‌ఫుల్ విత్ స్మార్ట్‌ఫోన్‌.

Loading...

Leave a Reply

*