హైద‌రాబాద్ జ‌నానికి గుడ్ న్యూస్‌.. పాత నోట్ల మార్పిడి వెరీ ఈజీ..!

untitled-4

మీరు హైద‌రాబాద్ వాసులా..? హైద‌రాబాద్‌లో ఉంటున్నారా? మీ ద‌గ్గ‌ర ఇంకా డిపాజిట్ చెయ్య‌ని పాత నోట్లు ఉన్నాయా..? బ‌్యాంకుల ముందు నిల‌బ‌డి నిల‌బ‌డి విసిగిపోయారా..? అయితే, శుభ‌వార్త‌. మీకు హైద‌రాబాద్‌లోని ఎర్ర‌గ‌డ్డ రైతు బ‌జార్ కేంద్రీయ భండార్ మీకు ఓ కొత్త ప‌థ‌కం ప్ర‌క‌టించింది. మీ దగ్గ‌ర ఉన్న పాత 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను తీసుకుని వ‌స్తే అంతే విలువ‌క‌ల స‌రుకుల‌ను తీసుకొని పోవ‌చ్చు.

గ‌త వారం రోజులుగా పెద్ద నోట్ల ప్ర‌భావం అన్ని రంగాల‌పైనా విస్తృతంగా ప‌డింది. ముఖ్యంగా రోజువారీ వేత‌నాలు, దిన‌స‌రి ఖ‌ర్చుల‌పై ఆధార‌ప‌డి జీవించే రైతు బజార్‌ల‌పై ఎక్కువ‌గా ఉంది. కూర‌గాయల ధ‌ర‌లు కూడా విపరీతంగా పెరిగిపోవ‌డంతో రైతుల క‌ష్టాలు కూడా అంతా ఇంతా కాదు. దీంతో, అక్క‌డి కేంద్రీయ భండార్ ఈ కొత్త ప‌థ‌కానికి తెర‌దీసింది. సో.. ఇప్ప‌టికీ మీ ద‌గ్గ‌ర పాత నోట్లు ఉంటే.. ఈ ఆఫ‌ర్‌ని స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. ఎలాగూ మంత్ ఎండింగ్‌కి వ‌చ్చాం క‌నుక మీకు ఇది గుడ్ న్యూసే. ఏమంటారు…?

Loading...

Leave a Reply

*