శాంసంగ్ కు దెబ్బ మీద దెబ్బ

samsung

ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంఛ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ నోట్-7 అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో శాంసంగ్ సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. దాదాపు 30వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఈ త్రైమాసికం చివరినాటికి ఫేస్ చేస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అంత మొత్తాన్ని భరించడానికి సంస్థ సిద్ధంగా ఉంది. ఇప్పటికే రీకాల్ ప్రకటించింది. అమ్మేసిన నోట్-7లను తిరిగి వెనక్కి తీసుకుంటోంది. మరో ఫోన్ ఇవ్వడం లేదా డబ్బులు వాపస్ చేయడం లాంటివి చేస్తోంది. అయితే ఇప్పుడిది చాలదన్నట్టు శాంసంగ్ కు మరో దెబ్బ తగిలింది.

దుబాయ్ ఎయిర్ పోర్టులో శాంసంగ్ నోట్-7 ఫోన్లపై నిషేధం విధించారు. విమానాల్లో నోట్-7తో ప్రయాణించడాన్ని దుబాయ్ కు చెందిన దాదాపు అన్ని ఎయిర్ లైన్స్ నిషేధించాయి. నోట్-7తో దేశంలోకి ప్రవేశించడం కానీ.. ఇప్పటికే దేశంలో ఉన్న వాళ్లు నోట్-7తో విమాన ప్రయాణం చేయడాన్ని నిషేధించాయి. ఇదే బాటలో మరిన్ని పశ్చిమాసియా దేశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయా దేశాలతో ప్రత్యేకంగా లాబీయింగ్ చేసేందుకు శాంసంగ్ కంపెనీ మధ్యవర్తుల్ని నియమిస్తోంది.

రీకాల్ అనేదే ఓ పెద్ద ప్రహసనం అనుకుంటే… ఇలా ఒక్కోదేశాన్ని మేనేజ్ చేయడం అనేది మరింత క్లిష్టమైన వ్యవహారం. మరీ ముఖ్యంగా తమకు మార్కెట్ బాగా ఉన్న మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల్లో ఇలాంటి నిషేదాలు ఎదురైతే మాత్రం శాంసంగ్ కొన్నేళ్లకు దివాలా తీయడం ఖాయం. అందుకే ఇప్పుడు శాంసంగ్ లో ఎవరూ నిద్రపోవడం లేదు. వరుసగా వస్తున్న ఆటుపోట్లను తట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Loading...

Leave a Reply

*