శాంసంగ్ కు అతిభారీ దెబ్బ… వేల కోట్లు నష్టం…

untitled-4

మొబైల్ రంగంలో ఓ స్థాయిలో దూసుకుపోతోంది శాంసంగ్ సంస్థ. ఆసియా మార్కెట్లో దీన్ని కొట్టడం ఆపిల్ తరం కూడా కావడం లేదు. కొన్ని మిగతా మొబైల్ సంస్థలు కలిసిపోయినప్పటికీ… శాంసంగ్ హవాను అడ్డుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా… శాంసంగ్ సంస్థ తనకు తానే చెక్ పెట్టుకుంది. 45శాతం వృద్ధిని నమోదుచేయాల్సిన త్రైమాసికంలో కేవలం 25శాతం వృద్ధికే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే… వచ్చే త్రైమాసికంలో శాంసంగ్ సంస్థ ఏకంగా 35వేల కోట్ల రూపాయల నష్టాన్ని భరించాల్సి వస్తోంది. దీనికి ఆ సంస్థ ఉత్పత్తి చేసిన గెలాక్సీ నోట్-7 మొబైలే కారణం.

ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన గెలాక్సీ నోట్-7లో తీవ్రమైన టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫోన్ వేడెక్కడం, బ్యాటరీ పేలిపోవడం లాంటివి జరుగుతున్నాయట. దీంతో లక్షల ఫోన్లను వెనక్కి తీసుకొస్తోంది ఈ సంస్థ. ఇలా రీకాల్ చేయడం ద్వారా 35వేల కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తోంది. ఈ నష్టాన్ని భరించడం సంస్థకు పెద్ద సమస్య కాదు. కానీ అసలు సమస్య భారత్ లోనే ఉంది.

అవును… ఇండియాలో ఈ సంస్థ ఇంకా శాంసంగ్ గెలాక్సీ నోట్-7ను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టలేదు. మరింత ప్రచార ఆర్భాటంతో త్వరలోనే భారత్ అంతటా తమ ఫ్లేగ్ షిప్ మోడల్ ను దించాలని భావిస్తోంది. ఇంతలోనే నోట్-7పై ఈ సమస్యలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో భారత్ లో ఎంతమంది ఈ ఫోన్లను కొంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. నోట్-7 అమ్మకాలపైనే కాకుండా.. శాంసంగ్ ప్రతిష్టకే ఇది మచ్చ తెచ్చే విధంగా మారుతోంది.

Loading...

Leave a Reply

*