జియో నెట్‌వ‌ర్క్‌లో బ్యాలెన్స్‌, డేటా యూసేజ్ చెక్ చేసుకోవ‌డం తెలుసా..?

untitled-1

దేశీయ టెలికాం మార్కెట్‌లో సంచ‌ల‌నం క్రియేట్ చేసింది రిల‌య‌న్స్ జియో. డేటాగిరి అంటూ రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్ర‌క‌టించిన ఆఫ‌ర్‌లు.. వినియోగ‌దారుల పంట పండిస్తున్నాయి. అప్ప‌టిదాకా భారీ టారిఫ్ ప్లాన్‌ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ చేసిన ఇత‌ర టెలికాం కంపెనీలు.. ఏకంగా ఆఫ‌ర్‌ల బాట‌ప‌ట్టాయి. అయితే, రిల‌య‌న్స్ జియో నెట్‌వ‌ర్క్‌పై ఇప్పటికీ వినియోగ‌దారుల్లో అనేక సందేహాలున్నాయి. ముఖ్యంగా బ్యాలెన్స్‌, డేటా యూసేజ్ చేసుకోవడం ఎలానో మీకు తెలుసా..? అయితే, ఈ స్టోరీ చ‌ద‌వండి..

రిల‌య‌న్స్ సిమ్ తీసుకుంటే చాలు.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌, 4జీ డేటా ఫ్రీగా పొంద‌వ‌చ్చు. ఈ ఆఫ‌రే జియోని వినియోగ‌దారుల‌కు చేరువ చేసింది. త‌క్కువ టైమ్‌లోనే ఊహించ‌ని రేంజ్‌లో క‌స్ట‌మ‌ర్‌ల‌ను ఆక‌ట్టుకొని గిన్నీస్ బుక్ రికార్డ్‌కు చేరువ చేసింది. అయితే, డిసెంబ‌ర్ 31వ‌ర‌కు దీనితో ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. అప్ప‌టిదాకా వెల్క‌మ్ ఆఫ‌ర్ కింద అంతా ఫ్రీనే. అయితే, ఆ త‌ర్వాత రూ.149 నుంచి రూ.4999 ప్లాన్ వ‌ర‌కు వివిధ టారిఫ్‌ల‌లో జియో ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. జియో యూజ‌ర్‌లు వాటిలో ఒక‌దానిని త‌మ‌కు న‌చ్చిన దానిని ఎంచుకొని వాడుకోవ‌చ్చు. అప్పటినుంచి జియో యూఎస్ఎస్డీ కోడ్స్ చాలా అవ‌స‌రం. మీ జియో నెట్ వ‌ర్క్ బ్యాలెన్స్‌, డేటా యూసేజ్‌, మొబైల్ నెంబ‌ర్ వంటి వివ‌రాల‌ను చెక్ చేసుకునేందుకు కావాల్సిన యూఎస్ఎస్డీ కోడ్స్ ఇవే..

*333#కు డ‌య‌ల్ చేస్తే.. మీ మెయిన్ బ్యాలెన్స్ స్క్రీన్‌పై ప్రత్య‌క్ష‌మ‌వుతుంది. లేదంటే… MBAL అని టైప్ చేసి 55333 నెంబ‌ర్‌కి ఎస్ఎమ్ఎస్ ద్వారా మీ మెయిన్ బ్యాలెన్స్ మీకు మెస్సేజ్ రూపంలో అందుతుంది. మీ జియో నెంబ‌ర్‌కి సంబంధించి మెయిన్ బ్యాలెన్స్‌, ప్యాకేజ్ వివ‌రాలు తెలుసుకోవాలంటే… BAL అని డ‌య‌ల్ చేసి 199కి ఎస్ఎమ్ఎస్ చేస్తే మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ డీట‌యిల్స్ అన్నీ మీకు మెస్సేజ్ రూపంలో అందుతాయి.

ఇక‌, మీరు పోస్ట్ పెయిడ్ సిమ్ యూజ్ చేస్తూ ఉంటే… BILL అని టైప్ చేసి 199కి డ‌య‌ల్ చేసి మీ జియో సిమ్ నుంచి ఎస్ఎమ్ఎస్ చేస్తే.. వెంట‌నే మీ డీట‌యిల్స్ వ‌స్తాయి. ఇక‌, మీరు ఏ ప్లాన్‌లో ఉన్నారో తెలుసుకోవాలంటే… MY PLAN అని టైప్ చేసి 199కి ఎస్ఎమ్ఎస్ చేస్తే.. మీరు ఏ ప్లాన్‌లో ఉన్నారో తెలుస్తుంది.

ఇక‌, *1# డ‌యల్ చేస్తే.. మీ జియో సిమ్ నెంబ‌ర్ మీకు స్క్రీన్‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. వీటితోపాటు మ‌రికొన్ని కోడ్స్‌పై త‌ర్వాత మ‌రింత‌గా చ‌ర్చించుకుందాం…

 

Loading...

Leave a Reply

*