కోహ్లీని మించిన మొన‌గాడు మ‌రొక‌డున్నాడు.. ఆ ఒక్క‌డు ఎవ‌రంటే..?

kohli

కోహ్లి సంచ‌ల‌న బ్యాట్స్‌మెన్‌.. ఆయ‌న గురించి ఎన్ని మాట‌లు చెప్పినా త‌క్కువే.. లెక్క‌లే నిద‌ర్శ‌నం.. ఆధునిక క్రికెట్‌కి దేవుడు.. స‌చిన్ టెండూల్క‌ర్‌. ఆయ‌న సృష్టించిన రికార్డ్‌లు అన్నీ ఇన్నీ కావు. అదో చ‌రిత్ర‌. ఆ హిస్ట‌రీని మ‌రెవ‌రూ చెరిపేయ‌లేర‌ని భావించారంతా. కానీ, ఆయ‌న రిటైర్ అయ్యాడో లేదో మ‌రో కొత్త దేవుడు పుట్టుకొచ్చాడు. ఆయ‌నే విరాట్ కోహ్లీ..

సెంచ‌రీలు చెయ్య‌డం ఇంత ఈజీగా అన్న‌ట్టు బ్యాట్ ఝ‌ళిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. మొన్న మొహాలీలో న్యూజిలాండ్‌పై జ‌రిగిన థ‌ర్డ్ వ‌న్‌డే మ్యాచ్‌లో 154 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇది కోహ్లీ కెరీర్‌లో 26వ‌ది. అయితే ఇన్ని సెంచ‌రీలు ఆయ‌న కేవ‌లం 174 మ్యాచ్‌ల‌లోనే బాదాడు కోహ్లీ.

వ‌న్‌డేల‌లో హ‌య్య‌స్ట్ సెంచ‌రీల రికార్డ్‌.. సచిన్ టెండూల్క‌ర్‌ది. 463 మ్యాచ్‌ల‌లో 49 సెంచ‌రీలు సాధించాడు టెండూల్క‌ర్‌. అయితే, కోహ్లీ కేవలం 174 మ్యాచ్‌ల‌లోనే 26 సెంచ‌రీలు కొట్టాడు. ఈ రికార్డ్‌ని మ‌రెవ‌రూ బీట్ చెయ్య‌లేర‌ని భావిస్తున్నారంతా. కానీ, అంతకుమించిన మొన‌గాడు ఒక్క‌డున్నాడు అంటున్నారు మేధావులు. అతను సౌతాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా. కేవలం 140 మ్యాచ్‌లలోనే 23 వన్డే సెంచరీలు చేశాడు ఆమ్లా.

చాలా తక్కువ మ్యాచ్‌లలోనే ఎక్కువ సెంచరీలు చేసి, కోహ్లీని సైతం అధిగమించగల ఏకైక ఆటగాడిగా నిలిచే అవకాశం అతనికి మాత్రమే ఉందనేది కొత్త వాదన. మిగిలిన వారిలో ఎవరూ కూడా వీరిరువురికి దగ్గర్లో లేరు. ఏబీ డివీలియర్స్ 24 శతకాలు బాదినప్పటికీ వాటిని సాధించడానికి 206 మ్యాచ్‌లు పట్టింది. అయితే ఆమ్లా వయసు 33 సంవత్సరాలు కాగా, కోహ్లీ వయసు 27 సంవత్సరాలు మాత్రమే.

వన్డేల్లో ఎక్కువ సెంచరీలు చేసిన వారి వివరాలు..
1) సచిన్ టెండూల్క‌ర్‌ – 49 సెంచరీలు – 463 మ్యాచ్‌లలో
2) రికీ పాంటింగ్ – 30 – 375 మ్యాచ్‌ల‌లో
3) స‌న‌త్ జయసూర్య – 28 – 445 మ్యాచ్‌ల‌లో
4) విరాట్‌ కోహ్లీ – 26 సెంచరీలు – 174 మ్యాచ్‌లలో
5) కుమార‌ సంగక్కర – 25 – 404 మ్యాచ్‌ల‌లో
6) ఏబీ డివీలియర్స్ – 24 – 206 మ్యాచ్‌ల‌లో
7) హషీమ్ ఆమ్లా – 23 సెంచరీలు – 140 మ్యాచ్‌లలో
8) క్రిస్ గేల్ – 22 – 269 మ్యాచ్‌ల‌లో

Loading...

Leave a Reply

*