తొలి ప‌ద్దు.. 6వేల కోట్ల బ్లాక్‌మ‌నీ అప్ప‌గించిన బిజినెస్ మేన్‌…!

untitled-2

పెద్ద నోట్లు ర‌ద్దు చేసి దాదాపు ఆరు రోజులు. స‌రిగ్గా 6 రోజుల ముందు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.. తాను ప్ర‌వేశపెడుతున్న కొత్త సంస్క‌ర‌ణ‌లతో అవినీతి రాయుళ్ల గుండెల్లో గుబులు రేగుతుంద‌న్నారు. వారికి ఇక నిద్ర ప‌ట్ట‌ద‌న్నారు. తీరా రెండు రోజుల త‌ర్వాత చూస్తే సీన్ రివర్స్ అయింది. సామాన్యులు రోడ్డుమీద‌కి వ‌చ్చి డ‌బ్బుల కోసం, చిల్లర కోసం బ్యాంక్‌ల ఎదుట‌, ఏటీఎమ్‌ల ఎదుట క్యూ క‌డుతుంటే.. బ్లాక్ లిస్ట్ పోటుగాళ్లు మాత్రం య‌ధేచ్చ‌గా చెల‌రేగిపోతున్నారు. త‌మ బ్లాక్‌ని వైట్‌ని చేసుకునే ప‌నిలో బిజీగా ఉన్నారు. దీంతో, మోదీ అవినీతిపై స‌ర్జిక‌ల్ స్ర్ట‌యిక్స్ అంటూ చేసిన పెద్ద నోట్ల ర‌ద్దుపై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

దానికి విరుద్ధంగా ఆరు రోజుల త‌ర్వాత ఓ బ‌డా బిజినెస్ మేన్‌.. త‌న బ్లాక్ మ‌నీ 6 వేల కోట్ల రూపాయ‌ల‌ను బ్యాంక్‌ల‌కు అప్ప‌జెప్ప‌డం విశేషం. గుజ‌రాత్‌లో పేరు మోసిన వ‌జ్రాల వ్యాపారి సూర‌త్ భాయ్ ప‌టేల్.. త‌న 6వేల కోట్ల బ్లాక్‌మ‌నీని ప్ర‌భుత్వానికి అప్ప‌జెప్పాడు. రీసెంట్‌గా ఆయ‌న దీపావ‌ళి ఆఫ‌ర్ కింద త‌న‌ద‌గ్గ‌ర ప‌నిచేసే ఉద్యోగులంద‌రికీ కార్లు, ఫ్లాట్‌లు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆయ‌నే ఈ 6వేల కోట్ల‌ను అప్పగించిన బిజినెస్‌మేన్‌. ఆయ‌న అప్ప‌గించిన 6 వేల కోట్ల‌లో దాదాపు 87శాతం ట్యాక్స్ ప‌డుతుంది. అంటే, 5400 కోట్ల రూపాయ‌లు ప‌న్ను. మ‌రో 1800 కోట్లు ఫైన్ కింద చెల్లించాడు. ఇక‌, బాలిక‌ల విద్య కోసం ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో 200 కోట్ల రూపాయ‌ల డొనేష‌న్ ఇచ్చాడు. అంతేకాదు, ఆయ‌నే గ‌తంలో ప్ర‌ధాని మోదీకి 10ల‌క్ష‌ల రూపాయ‌ల సూట్‌ని బ‌హూక‌రించింది.

అయితే, సూర‌త్‌భాయ్ ప‌టేల్ 6వేల కోట్ల రూపాయ‌ల బ్లాక్‌మ‌నీని ప్ర‌భుత్వానికి అప్ప‌గంచ‌డంపై భారీ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మోదీపై వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌తో కావాల‌నే బీజేపీ నేత‌లు సూర‌త్ భాయ్ ప‌టేల్‌తో నాట‌కం ఆడిస్తున్నార‌ని, ఇదంతా ఫార్స్ అని విప‌క్షాలు చెబుతున్నాయి. ఇది నిజం కూడా అవ్వొచ్చు. లేదంటే, ఎవ‌రూ ముందుకురాని టైమ్‌లో ఆయ‌నే వ‌చ్చి ఇలా త‌న ఆస్తుల‌ను ప్ర‌భుత్వానికి ప్ర‌క‌టించ‌డం ప‌లు ఆరోప‌ణ‌ల‌కు తావిస్తోంది.

Loading...

Leave a Reply

*