గూగుల్ చెబుతున్న ఏటీఎం అడ్ర‌స్‌

untitled-14

ఎవ‌రికి ఏం అవ‌స‌ర‌మో తెలుసుకుని అందుకు త‌గిన సేవ‌లు అంద‌జేయ‌డం ప్ర‌ఖ్యాత సెర్చ్ ఇంజ‌న్ గూగుల్‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. అందుకే ప్ర‌పంచంలోనే గుగూల్ నెంబ‌ర్‌వ‌న్‌గా నిలుస్తోంది. దాని కొట్టి ఎవ‌రూ ముందుకు రాలేక‌పోతున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దుతో దేశ ప్ర‌జ‌లంతా పొద్దున లేస్తే… బ్యాంకులు, ఏటీఎంలకు క్యూలు క‌డుతున్నారు. చాలా ప్రాంతాల‌లో ఏటీఎంలు అడ్ర‌స్‌లు తెలియ‌క ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన గూగుల్ దీనికి తానేం చేయ‌గ‌లుగుతామా అని ఆలోచించింది.

దానికి ఒక ప‌రిష్కారాన్ని క‌నిపెట్టింది. త‌న శాటిలైట్ ఇమేజ్‌ల‌ను వినియోగించి గూగుల్ సెర్చ్‌లో స‌రికొత్త ఆప్ష‌న్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ సెర్చ్ బార్‌ కింద ఫైండ్ ఆన్ ఏటీఎం నియ‌ర్ యూ అనే బ‌ట‌న్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాన్ని క్లిక్ చేస్తే… మ‌న ద‌గ్గ‌ర్లోని ఏటీఎం ఎక్క‌డుంతో మ్యాప్ ద్వారా చూపిస్తోంది. సింగిల్‌ క్లిక్‌తోనే మన దగ్గర్లో ఉన్న అన్ని ఏటీఎంల వివరాలు క‌ళ్ల‌ముందే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.

ఎలాంటి ప్ర‌త్యేక‌మైన యాప్‌లు అవ‌స‌రం లేకుండా… వెబ్‌ బ్రౌజర్‌లో గూగుల్‌ హోం పేజీకి వెళ్లి అక్క‌డే ఏర్పాటు చేసిన‌ ‘ఫైండ్‌ యాన్‌ ఏటీఎం నియర్‌ బై యూ’ అని ఉంటుంది.. అక్కడ క్లిక్‌ చేస్తే వెంటనే మన లొకేషన్‌ తీసుకుని దగ్గర్లో ఉన్న ఏటీఎంలను చూపుతుంది. మొబైల్‌లో దానిపై క్లిక్‌చేస్తే ఆటోమేటిక్‌గ్గా మ్యాప్స్‌ యాప్‌ ఓపెన్‌ అవుతుంది. ఒకవేళ ఆ యాప్‌ మీ మొబైల్‌లో లేకపోతే బ్రౌజర్‌లోనే మ్యాప్స్‌ ఓపెన్‌ చేసి డిస్‌ప్లే చేస్తుంది.

Loading...

Leave a Reply

*