గూగుల్ గొప్ప చూడండి

untitled-13

సెర్చ్ ఇంజ‌న్లలో గూగుల్ టాప్‌. ఏవ‌రికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా గూగుల్ త‌ల్లిని శ‌ర‌ణు కోర‌డం నేటి రోజుల‌లో కామ‌న్‌. అదే స‌మ‌యంలో స్మార్ట్ ఫోన్లలో కూడా గూగుల్ ఇప్పుడు రారాజుగా నిలుస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్న స్మార్ట్ ఫోన్‌గా గూగుల్ ఫిక్సల్ ఫోన్ అగ్రభాగాన నిలిచింది. ఈ ఫోన్‌ను ఐ ఫోన్‌కు ధీటుగా మార్కెట్‌లోకి తేవాల‌ని గూగుల్ సంక‌ల్పించింది. అయితే, ఆ ఫోన్ విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నంగా మారింది.

వెబ్‌సెర్చ్ ద్వారా ప్రపంచంలో ఎక్కువ మంది వెతికే టాఫ్ టెన్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ఫిక్సల్ ఫోనే మ‌కుటం లేని మ‌హారాజు. ఆ జాబితాలో గూగుల్ ఫిక్సల్ ఫోన్ త‌ర్వాత రెండో స్థానంలో షియోమి నుంచి వ‌చ్చిన రెడ్ మీ నోట్‌3 నిలిచింది. సామ్‌సంగ్ గెలాక్సీ జే7 మూడో స్థానంలోనూ… గూగుల్ ఫిక్సెల్ ఎక్స్ఎల్ నాలుగో స్థానంలోనూ, సామ్‌సంగ్ జెడ్‌2, గెలాక్సీ జే7లు ఆరు, ఏడు స్థానాల్లోనూ…. యాపిల్ ఐ ఫోన్ 7, షియోమీ రెడ్‌మీ నోట్ 3ఎస్ ప్రైమ్ ఏడు, ఎనిమిది స్థానాల్లోనూ…. తొమ్మిదో స్థానంలో మోటొరోలా మోటో జీ4ప్లస్‌, సామ్‌సంగ్ జీ5 ప‌దో స్థానంలోనూ ఉన్నాయి. ఇదీ వ‌ర‌స ఇక ఈ టాప్ టెన్‌లో మీకే ఫోన్ కావాలో తేల్చుకుని మీరూ ఓ లుక్కేయండి.

Loading...

Leave a Reply

*