ఇది ఆపిల్ కు అమ్మమ్మ…

untitled-10

ఇప్పటివరకు హైఎండ్ ఫోన్లు అంటే ఎవరైనా ఐ-పోన్ గురించే మాట్లాడేవారు. ఆపిల్ సంస్థ నుంచే వస్తున్న ఈ ఫోన్లు కొనుక్కుంటే సెక్యూరిటీ విషయంలో ఇక ఆలోచించనక్కర్లేదు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఫీచర్లు కాస్త తక్కువే అయినప్పటికీ… సోషల్ స్టేటస్, సెక్యూరిటీ విషయాల్లో ఐ-పోన్ ను మించింది ఇంకోటి రాలేదు. అయితే ఇది నిన్నటి మాట. ఇప్పుడు దీనికి బాబులాంటి ఫోన్ ఒకటి రెడీగా ఉంది. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది.

మీరు మంచి సోషల్ స్టేటస్ కోరుకుంటున్నారా.. మీ చేతిలో ఫోన్ చూసి రెస్పక్ట్ ఆశిస్తున్నారా… సెక్యూరిటీ విషయంలో 1 శాతం కూడా కాంప్రమైజ్ కాకూడదని ఫిక్స్ అయ్యారా… మాటిమాటికి ఫోన్లు మార్చే పద్ధతికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా… అయితే జస్ట్ ఒక లక్ష రూపాయలు చేతిలో పెట్టుకోండి చాలు.. మీకోసం గూగుల్ సంస్థ ఓ దిమ్మతిరిగే ఫోన్ ను రెడీ చేస్తోంది.

ఈనెల 24 నుంచి గుగూల్ సంస్థ తమ ఫ్లాగ్ షిప్ మోడల్ ను మార్కెట్లోకి దించడానికి రెడీ అవుతోంది. వీటి ప్రారంభ ధరలు 80వేల రూపాయల నుంచి ఉన్నాయి. మరీ కాస్ట్ లీ ఫోన్లకు భారత్ లో మార్కెట్ తక్కువ కాబట్టి… స్టార్టింగ్ లో ఫ్లిప్ కార్ట్, ఎమెజాన్ లాంటి సంస్థలతో కలిసి గూగుల్ కొన్ని ఆఫర్లు కూడా ఇస్తోంది. పిక్సెల్ సిరీస్ లో భాగంగా విడుదల కానున్న ఈ ఫోన్లలో పైకి చెప్పుకునే ఫీచర్లు కామన్ గానే ఉంటాయి. కానీ ఇందులో బ్యాంకింగ్ సేవలు, పాస్ వర్డ్ ప్రొటెక్షన్ లాంటివి ది బెస్ట్ అంటున్నారు. అందుకే వీటికి ఇంత రేటు. కావాలంటే మీరూ బుక్ చేసుకోండి.

Loading...

Leave a Reply

*