గూగుల్ అల్లో వాడితే అంతే సంగ‌తులు

google-allo

ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌…వాట్స‌ప్ లాంటి చాటింగ్ యాప్‌ల్లో గూగుల్ అల్లో గుబులు రేపుతోంది….. గూగుల్ రూపొందించిన ఈ చాటింగ్ యాప్‌లో ఒక‌టా రెండా బోల్డ‌న్ని ఫీచ‌ర్లు ఉన్నాయి… ఫేస్‌బుక్‌, వాట్స‌ప్‌ని త‌ల‌ద‌న్నే విధంగా దీన్ని రూపొందించారు…. దీంతో గూగుల్ అల్లోని చూసి ఫేస్‌బుక్‌, వాట్స‌ప్‌ల‌కు గుండెలు అదిరిపోతున్నాయి… దీన్ని చూసి వాట్స‌ప్ హ్యాండ్స‌ప్ అంటోంది… ఫేస్‌బుక్ ఫేసు మాడిపోతోంది… అయితే ఇంత బాగుంది క‌దా అని గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి అల్లో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు బాప్‌రే అనాల్సి వ‌స్తుందిట‌…. ఈ అల్లో వాడితే ఆ త‌ర్వాత ఆయింట్‌మెంట్ రాసుకోవాల్సిందే అంటున్నారు సాఫ్ట్‌వేర్ నిపుణులు…. ఈ అల్లో యాప్ వాడితే ప్రైవ‌సీ దెబ్బ‌తింటుంద‌ట‌… మ‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌న్ని గూగుల్ చేతికి చేరిపోతాయిట‌… ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు…

ప్ర‌జ‌ల ర‌హ‌స్య స‌మాచారాన్ని అమెరికా ఎలా కొల్ల‌గొడుతోందో ప్ర‌పంచానికి వివ‌రించి సంచ‌ల‌నం సృష్టించిన ఎడ్వ‌ర్డ్ స్నోడెన్ స్వ‌యంగా ఈ విష‌యాల‌ను తెలియ‌జేశారు…. అల్లో స్మార్ట్ చాట్ యాప్‌ను ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని ఆయ‌న వినియోగ‌దారుల‌ను హెచ్చ‌రిస్తున్నారు.. గూగుల్ తెచ్చిన ఈ యాప్‌లో ప్రైవ‌సీ స‌రిగా లేద‌ని, ఈ చాట్ యాప్ ద్వారా మ‌నం పంపే సందేశాల‌న్నింటిని గూగుల్ స్టోర్  చేస్తుంద‌ని ఆయ‌న అస‌లు ర‌హ‌స్యాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు.. మెసేజ్‌ల‌ను తాత్కాలికంగా మాత్ర‌మే స్టోర్ చేస్తామ‌ని మొద‌ట ప్ర‌క‌టించిన గూగుల్ అల్లో టీమ్‌, అన్ని మెసేజ్‌ల‌ను డిలీట్ చేసేవ‌ర‌కు స్టోర్ చేసే ఉంచుతామ‌ని ఇప్పుడు చెబుతోంది….

అదేవిధఃగా గూగుల్‌కు, డివైజ్‌కు మ‌ధ్య మెసేజ్‌లు ఎన్‌క్రిప్టెడ్ అయి ఉంటాయ‌ని.. వాటిని గూగుల్ చ‌దివే వీలు ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది…. ప్రైవ‌సీ లేకుండా వ్య‌క్తిగ‌త వివ‌రాలు కాజేస్తోంద‌ని ఈ యాప్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో ఈ యాప్‌ను గూగుల్ నిఘాగా విమ‌ర్శిస్తూ ఎడ్వ‌ర్డ్ స్నోడెన్ ప‌లు ట్వీట్లు చేశారు. సో భ‌ద్రం బీకేర్‌ఫుల్‌… అల్లో యాప్‌ను వాడాల‌నుకుంటే ఆలోచించి వాడండి. మీ మెసేజ్‌ల‌ను మూడో క‌న్ను చూస్తూ ఉంటుంద‌ని, మీ మాట‌ల‌ను మూడో చెవి వింటూ ఉంటుంద‌ని మ‌ర్చిపోకండి.

Loading...

Leave a Reply

*