జియో యూజ‌ర్‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌…!

jio

జియో యూజ‌ర్‌లు ఇటీవ‌ల కాస్త డీలా ప‌డ్డారు. డేటా స్పీడ్ బాగా త‌గ్గింద‌ని భాధ ప‌డుతున్నారు. గతంలోలా అది అంత వేగంగా లేద‌ని చాలామంది అసంతృప్తికి లోన‌వుతున్నారు. ఈ వ్యాఖ్య‌లు రిల‌య‌న్స్ వ‌ర్గాల దాకా వ‌చ్చాయి. ఇటు నెట్ వ‌ర్క్ సరిగాలేద‌ని ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. భారీ అంచ‌నాల‌తో మార్కెట్‌లోకి వ‌చ్చిన జియోని విప‌రీతంగా వేధిస్తున్న స‌మ‌స్య‌ల‌తో ఇదే ప్ర‌ధాన‌మైన‌ది. ఇన్నిఫిర్యాదులు ఉన్నా.. జియో యూజ‌ర్ల సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ సిమ్‌ను తీసుకోవ‌డానికే ఇష్ట‌ప‌డుతున్నారు వినియోగ‌దారులు. దీంతో, దాని డిమాండ్ మ‌రింత పెరిగింది.

రాబోయే రోజుల‌లో జియో డిమాండ్ మ‌రింత పెరుగుతుంద‌నే ఆలోచ‌న‌తో… ముందుగా రిల‌య‌న్స్ యూజ‌ర్‌ల‌కు సిగ్న‌ల్ స‌మ‌స్య లేకుండా చేసే ప్లాన్ చేస్తోంది. దీనికోసం రాబోయే 6 ఆరు నెలల్లో మినిమ‌మ్ 45 వేల నెట్ టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే నాలుగేళ్లలో టెలికం వ్యాపారాన్ని విస్తరించడానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు జియో ప్ర‌క‌టించింది. ఇందుకు తగ్గట్టుగా కొత్త టవర్ల ఏర్పాటుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు తెలిపాయి.

ఈ టవర్ల ఏర్పాటుకు సంబంధించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ నుంచి వచ్చిన దరఖాస్తుపై నియంత్రణ మండలి వర్గాలు స్పందించలేదు. ఇప్పటికే జియో 2.82 లక్షల టవర్లను ఏర్పాటు చేయడానికి రూ.1.6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది. టెలికం దిగ్గజాలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలతో ఇంటర్ కనెక్టింగ్ వివాదం కారణంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నామని..అందుకే తామే కొత్త‌గా ట‌వ‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని జియో తెలిపింది. ఇదే జ‌రిగితే.. జియో వినియోగ‌దారుల సంఖ్య మ‌రింత పెరగ‌డం ఖాయం.

Loading...

Leave a Reply

*