అలాంటి అబ్బాయిలంటే అమ్మాయిలు ప‌డిచ‌స్తారు

girls

ఆడువారి మాట‌ల‌కు అర్థాలే వేరులే అన్న‌ట్టు…. వారి చేష్ట‌ల‌కు కూడా అర్థాలే వేరులే అంటున్నారు మాన‌సిక నిపుణులు… వాళ్లు స‌ర‌దాగా ర‌మ్మంటే స‌ర‌సాలు ఇంక చాల‌ని అర్థంట‌.. సీరియ‌స్‌గా క‌నిపిస్తుంటే తోడు కావాల‌ని కోరుకుంటున్నార‌ని అర్థం…. స‌ముద్రం లోతు తెలుసుకోవ‌చ్చు గానీ అమ్మాయిల గుండెలోతు తెలుసుకోలేమంటారు అనుభ‌జ్ఞులు… ఆడ‌వారి మూడ్స్‌ని బ‌ట్టి మ‌గ‌వాళ్లు న‌డుచుకోవాల‌ని సైకియాట్రిస్టులు చెబుతున్నారు.. ఎలాంటి అబ్బాయిలంటే అమ్మాయిలు ఇష్ట‌ప‌డ‌తారో తెలుసుకోవాల‌ని వాళ్లు ఒక అధ్య‌య‌నం చేశారు.. అందులో స్ట‌న్నింగ్ నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి…

అమ్మాయిల‌ను ఎలా ప‌డ‌గొట్టాలో వాళ్లు తెలుసుకోగ‌లిగారు… ఎలాంటి అబ్బాయిలంటే అమ్మాయిలు ప‌డిచ‌స్తారో వాళ్ల‌కు అర్థ‌మైపోయింది…. వాళ్లు చెప్పిన‌దాని ప్ర‌కారం న‌డుచుకుంటే కుర్రాళ్లు… అమ్మాయిలు మీ వెన‌క ప‌రిగెట్టుకుంటూ వ‌స్తారు…. ఎప్పుడు సీరియ‌స్‌గా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిల‌కు అస్స‌లు ఇష్టం ఉండ‌దుట…. సైలెంట్‌గా ఉండ‌డాన్ని కూడా అమ్మాయిలు ఇష్ట‌ప‌డ‌రుట… అమ్మాయిల ద‌గ్గ‌ర చొర‌వ‌గా ఉండి మంచి జోకులు వేస్తూ సెన్సాఫ్ హ్యుమ‌ర్‌తో న‌వ్వులు పూయించే కుర్రాళ్లంటే ప‌డ‌తులు పిచ్చెక్కిపోతారుట‌… మంచి మాట‌కారులైతే మీరు మ‌గువ‌ల మ‌న‌సు ఇట్టే దోచేసుకోవ‌చ్చు….

మీలో అస్స‌లు నీర‌సం క‌నిపించ‌కూడ‌దు… హ్యుమ‌ర‌సం పొంగి పొర్లుతుండాలి… పంచ్‌లు వేస్తూ గ‌ల‌గ‌లా మాట్లాడితే అమ్మాయిలు ఫిదా అయిపోతారుట‌.. సెటైర్లు వేస్తూ స‌ర‌దాగా మాట్లాడితే స‌ర‌సాల‌కు సై అంటారుట‌… అబ్బాయిలు ఎంత స‌ర‌దాగా ఉంటే అమ్మాయిల్లో అంత స‌ర‌సం ఉప్పొంగుతుంద‌ట‌… సో అబ్బాయిలు మీరు అమ్మాయిల‌ను ప‌డెయ్యాలంటే ఖ‌రీదైన కార్లు బైకులు అక్క‌ర్లేదు… మీరు న‌వ్వులు పూయిస్తే అమ్మాయిలు మీతో ల‌వ్వులో ప‌డిపోవ‌డం గ్యారంటీ అంటున్నారు మాన‌సిక శాస్త్ర‌వేత్త‌లు. సో ఇక ఫ‌న్‌తో విన్ అవండి… కామెడీతో కాంత‌ల‌ను పడెయ్యండి.

Loading...

Leave a Reply

*