ఆ విష‌యంలో అమ్మాయిలు సేఫ్‌.. క‌ష్టాల‌న్నీ అబ్బాయిల‌కే..!

boys-and-girls

అబ్బాయిలూ.. ఇది చ‌దివి కాస్త జాగ్ర‌త్త‌గా ఉండండి.. ముఖ్యంగా నైట్ షిఫ్ట్‌లు చేసేవాళ్లు.. ప‌గ‌టి పూట కాసేప‌యినా కునుకు తీయ‌ని వారు.. రోజుకు 10 గంట‌ల‌కు పైగా నిద్ర‌పోయేవారు ఇక నుంచి కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. ఎందుకంటే, వీరిలో కేన్సర్ సోకే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. చైనాలోని ఓ ప్రఖ్యాత యూనివ‌ర్శిటీ చేసిన స్టడీలో ఈ వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. మ‌ధ్య, వ‌య‌సు మ‌ళ్లిన 27వేల మందిని ఇంట‌ర్‌వ్యూలు చేసిన త‌ర్వాత ఈ వాస్త‌వాల‌ను ప్ర‌చురించింది ఈ యూనివ‌ర్శిటీ.

వారి ప్రాధాన్య‌తను ఎక్కువ‌గా నైట్ షిఫ్ట్‌లు చేసేవారు, ప‌గ‌టిపూట కాసేప‌యినా నిద్ర‌పోని వారు, రాత్రిపూట ఎక్కువ‌గా నిద్ర‌పోయే వారిపై పెట్టారు.
వీరిలో సాధార‌ణ పురుషుల కంటే కేన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం దాదాపు 27 శాతం అధికంగా ఉన్నట్టు తేలింది. మధ్యాహ్నం పూట అరగంట పాటు కునుకు తీసే వారితో పోలిస్తే నిద్రపోని వారిలో కేన్సర్ వచ్చే ప్రమాదం రెండింతలు అధికంగా ఉన్నట్టు తేలింది. అలాగే రాత్రివేళ పది గంటలకు పైగా నిద్రించే పురుషుల్లోనూ కేన్సర్ రిస్క్ ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఈ లక్షణాలు మహిళల్లో కనిపించకపోవడం విశేషం.

Loading...

Leave a Reply

*