గంభీర్‌కి ఇంగ్లాండ్ టెస్ట్‌.. నాడు ఓడిపోయాడు.. నేడు ఏం చేస్తాడు…?

untitled-3

గౌత‌మ్ గంభీర్‌.. గంగూలీ రిటైర్ అయిన తర్వాత ఇండియాకి మంచి ఎడం చేతి బ్యాట్స్‌మెన్ దొరికాడ‌ని భావించారు. కెరీర్ ప్రారంభంలో ఆయ‌న అదే రేంజ్‌లో ఫ‌లితాలు ఇచ్చాడు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, 2011 త‌ర్వాత ఆయన నుంచి స‌రైన ఇన్నింగ్స్ రాలేదు. ఎన్ని చాన్స్‌లు ఇచ్చినా త‌డ‌బ‌డ్డాడు. దీంతో, గౌత‌మ్ గంభీర్‌ని న‌మ్ముకోవ‌డం కంటే.. ఇత‌ర బ్యాట్స్‌మెన్‌కు చాన్స్ ఇచ్చారు. వారు ప్రూవ్ చేసుకోవ‌డంతో గంభీర్‌కి జ‌ట్టులో స్థాన‌మే లేకుండా పోయింది.

అయితే, ఆయ‌న‌కు మ‌రోసారి చాన్స్ ద‌క్కింది.. ఓపెన‌ర్ కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత అనుకోకుండా టెస్టు జట్టులోకి వచ్చిన గంభీర్‌కు న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనే అవకాశం దక్కింది. గంభీర్‌ ఆ మ్యాచ్‌లో కొంత క‌న్‌ఫ్యూజ్ అయ్యాడు. అత‌డికి గాయం కూడా అయింది. అయితే, న్యూజిలాండ్ సిరీస్‌లో ఆయ‌న‌కు జ‌ట్టులో చోటు తాత్కాలిక‌మే అన్న భ‌యంతోనే గంభీర్ డైల‌మాలో ప‌డిపోయాడ‌ట‌. కానీ, ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌కు పూర్తి అవ‌కాశం ద‌క్కించుకున్నాడు గంభీర్‌. దీంతో, ఆయ‌న‌లో ఆత్మవిశ్వాసం తొణికిస‌లాడుతోంది. ఇక‌, త‌డాఖా చూపించ‌డ‌మే మిగిలి ఉంది.

గంభీర్ కెరీర్ దెబ్బ‌తిన‌డానికి కార‌ణం.. ఇంగ్లండ్‌. 2011లో అతను ఇంగ్లాండ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. 2014లో మళ్లీ ఇంగ్లాండ్‌ సిరీస్‌కే పునరాగమనం చేశాడు. మళ్లీ విఫలమై రెండేళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు సొంతగడ్డపై ఇంగ్లిష్‌ బౌలర్లను గౌతీ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. మ‌రి, ఈ సారయినా ఇంగ్లాండ్‌ను గంభీర్ ధీమాగా ఫేస్ చేస్తాడా..? చేసి జ‌ట్టులోకి వ‌స్తాడా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌.

 

Loading...

Leave a Reply

*