బ‌జ్జీ, వ‌డ‌, పూరి, మైసూర్ బోండా ఇలా తింటే.. మీకు తప్ప‌దు భారీ మూల్యం..!

bajji

మీకు మిర‌ప‌కాయ్ బ‌జ్జీ అంటే ఇష్ట‌మా..? పొద్దునే టిఫిన్ చెయ్య‌డానికి మైసూర్ బోండానే ఇష్ట‌ప‌డ‌తారా..? ఎక్క‌డికి వెళ్లినా మీరు వీటినే ఆర్డ‌ర్ చేస్తున్నారా? ఈ రెండు టిఫిన్ ప్రియులా మీరు..? అయితే, కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి సుమా..!మిర‌ప‌కాయ్ బ‌జ్జీ, మైసూర్ బ‌జ్జీ వంటి వాటిని మీరు డైరెక్ట్‌గా తింటే ఏమీ కాదట‌. వాటిల్లో మంచి నూనె వాడ‌క‌పోతే అదో స‌మ‌స్య‌. దానిని ప‌క్క‌న పెట్టండి. కానీ, మీరు వాటిలో పేప‌ర్‌లో వేసుకొని తింటున్నారా? అదే ఇప్పుడు అస‌లు స‌మ‌స్య‌ట‌. అంతేకాదు, కొంత‌మందికి ఈ టిఫిన్‌లు అంటే భ‌లే ఇష్టం. ఏ టిఫిన్ సెంట‌ర్‌కి వెళ్లినా వీటినే ఆర్డ‌ర్ చేస్తుంటారు. అయితే, ఇవి ఎక్కువ‌గా నూనె పీల్చుకొనే ప‌దార్ధాలు. వాటికి ప‌ట్టిన అద‌న‌పు నూనెని వ‌ద‌లించుకోవ‌డం కోసం చాలా మంది పేప‌ర్‌లో వేసి.. గ‌ట్టిగా ప్రెస్ చేస్తారు.

ఆ త‌ర్వాత‌ ఆ నూనెని పిండుతారు. ఆ త‌ర్వాత వాటిని మళ్లీ ప్లేట్‌లో వేసుకొని ఫూటుగా లాగిస్తారు. దీంతో, అనారోగ్యం గ్యారంటీ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.నూనెను వ‌దిలించుకోవ‌డం అంటే.. కొవ్వు చేరుతుంద‌నే భ‌యంతో అది మంచిదే అయినా.. అందుకోసం న్యూస్ పేప‌ర్‌ని వాడ‌డం మాత్రం మంచిదికాదు. అది పూర్తిగా హానిక‌రం. ఈ నూనె వంట‌కాల‌ను పేప‌ర్ మీద పెట్ట‌గానే.. పేప‌ర్‌లోని న్యూస్ ప్రింట్ ఇంక్ క‌ర‌గ‌డం మొద‌ల‌వుతుంది. ఈ ప్రింట్ ఇంక్‌లోని గ్రాఫైట్ మ‌నం తినే బ‌జ్జీ, పూరి, వ‌డ‌, మైసూర్ బ‌జ్జీ వంటి ప‌దార్ధాల‌లోకి చేరి తిన్న త‌ర్వాత మ‌న బాడీలోకి చేరుతుంద‌ట‌. ఆ గ్రాఫైట్ వ‌ల్ల మూత్ర‌పిండాలు, కాలేయం, ఎముక‌లు, క‌ణ‌జాలం పెరుగుద‌ల దెబ్బ‌తింటాయి.

సాధార‌ణంగా ఎలాంటి హానికారక పదార్థాన్నైనా మన శరీరం సహజసిద్ధంగానే విసర్జిస్తుంది. కానీ గ్రాఫైట్‌ అలా కాదు. అది శరీరంలో నిల్వ ఉండిపోతుంది. అందుకే, అద‌నపు నూనెను వ‌దిలించుకోవాల‌నుకుంటే… టిష్యూ పేప‌ర్‌లు వాడండి.. చేతులు తుడుచుకోవడానికి కూడా వాటినే యూజ్ చెయ్యండి.. అంతేకానీ, చివ‌రలో తిన్న తర్వాత‌.. నూనె చేతులు జిడ్డుగా ఉన్నా పేప‌ర్‌కి తుడ‌వ‌కండి.. అందులో ఉన్న గ్రాఫైట్ మీకు మ‌ళ్లీ హానిక‌ర‌మే. రాబోయేది చ‌లికాలం. కావున‌, సాయంత్రాలు పూట‌, పొద్దునే వేడివేడిగా వాటిని ఆర్డ‌ర్ చేసి న్యూస్ పేపర్‌కి మాత్రం తుడ‌వ‌కండి. అలా చేస్తే మీ ఆరోగ్యానికి తప్ప‌దు భారీ మూల్యం.

Loading...

Leave a Reply

*