ద‌స‌రా పోయింది… దీపావ‌ళి ధ‌మ‌కా మొద‌లైంది!

untitled-12

పండుగ రోజుల్లో రెచ్చిపోతున్న ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు మ‌ళ్లీ త‌మ స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి. మొన్న ద‌స‌రాకు బిగ్‌బిలియ‌న్ డేస్ అంటూ ఐదు రోజుల విక్రయాల స్పెష‌ల్ పెట్టి వేల కోట్ల రూపాయ‌ల వ్యాపారం చేసిన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, స్నాప్‌డీల్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు దీపావ‌ళి ధ‌మాకాకు సిద్ధమ‌వుతున్నాయి. దీపావ‌ళి డీల్స్‌లో ఒక అడుగు ముందుగా ఉన్న అమెజాన్ మ‌రోసారి బిగ్ బిలియ‌న్ సేల్‌ను మొద‌లెట్టింది. గ‌తంలో ఏడాదికి ఒక‌సారి మాత్రమే ఈ కామ‌ర్స్ సంస్థలు ఆన్‌లైన్ సేల్స్‌ను చేప‌ట్టేవి. బిగ్ బిలియ‌న్ డేస్ నిర్వహించేవి. ఈ ఆన‌వాయితీకి భిన్నంగా అమెజాన్ ఈసారి ప‌ది రోజుల వ్యవ‌ధిలోనే రెండోసారి బిగ్‌బిలియ‌న్ డేస్ సేల్‌ను వినియోగ‌దారుల ముందుంచింది. అయితే, ఈ సారి అమెజాన్ పూర్తిగా స్మార్ట్ ఫోన్ల‌పైనే ఫోక‌స్ పెట్టింది. భారీ డిస్కౌంట్లను ప్రక‌టించింది. క్రెడిట్ కార్డుల‌పై ప్యత్యేకంగా ఇస్తున్న రాయితీలేంటే మీరూ చూడండి…

లెనోవొ జెడ్2 ప్లస్(64 జీబీ)…. ఫీచర్లు: 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, ధర: 19,999 రూపాయలు
దీనిపై ప్రత్యేక డిస్కౌంట్: క్రెడిట్ కార్డ్‌పై 1250 రూపాయల క్యాష్ బ్యాక్ పొందే అవకాశం… వొడా ఫోన్ ద్వారా 1జీబీ ధరకే 9జీబీ డేటా ఇస్తారు. అలాగే, ఎయిర్‌టెల్ నుంచి 1జీబీ ధరకే 15జీబీ డేటాను కూడా అందిస్తోంది.
ఇక‌, ఇలాంటి ఆఫ‌ర్లే ఉన్న మ‌రికొన్ని ఫోన్లు…… లెనోవొ జెడ్2 ప్లస్(32జీబీ) ఫోన్ మీద రూ.1150ల క్యాష్‌బ్యాక్ చాన్స్‌. లెనోవో వైబ్ కె4 నోట్‌పై రూ.1000ల క్యాష్‌బ్యాక్. హానర్ 8పై రూ.2,200ల క్యాష్‌బ్యాక్. హానర్ 5సి ఫోన్ మీద రూ.1000ల తగ్గింపు

Loading...

Leave a Reply

*