పాక్‌లో ఉంటూ.. పాక్ క్రికెట‌ర్ ఆఫ్రిదినే చంపుతాన‌ని బెదిరించిన దావూద్‌..!

afridhi

గ‌త కొన్నాళ్లుగా సాగుతున్న పాక్ క్రికెటర్‌ల గొడ‌వ కొత్త మ‌లుపు తీసుకుంది. జావెద్ మియాందాద్ వ‌ర్సెస్ గంభీర్.. ఇదీ గ‌త వారం రోజులుగా పాక్‌లో జ‌రుగుతున్న వార్‌. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం నడుస్తోంది. ఈ వార్‌లోకి జావెద్ మియాందాద్‌కి అండ‌గా మాఫియా డాన్‌, అండ‌ర్ వ‌రల్డ్ అధినేత దావూద్ ఇబ్ర‌హీం ఎంట్రీ ఇచ్చాడు. అందులో ఓ క్రికెటర్‌కి.. `నోర్మూసుకో లేదంటే.. జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండు` అంటూ సీరియ‌స్ వార్నింగ్ పంపాడు.

ఈ హెచ్చ‌రిక ఎవ‌రికో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. షాహిద్ అఫ్రీదీకే. ఎందుకంటే, మియాందాద్ త‌న‌యుడుకి త‌న కూతురిని ఇచ్చి వివాహం చేశాడు దావూద్ ఇబ్ర‌హీం. ఇలా, ఈ ఇద్ద‌రూ వియ్యంకుల‌య్యారు. దీంతో, ఆ వార్నింగ్‌.. అఫ్రీదీకే అంటున్నారు విశ్లేష‌కులు.

ఈ గొడ‌వ‌కు అస‌లు కార‌ణం.. టీ20 ప్రపంచకప్‌ అనంతరం జట్టులో స్థానం కోల్పోయిన విధ్వంసక క్రికెటర్‌ అఫ్రిది తన సెండాఫ్‌ మ్యాచ్‌ కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుతో సీక్రెట్‌గా చ‌ర్చలు జ‌రుపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై మియాందాద్‌ మాట్లాడుతూ డబ్బులు కోసమే ఈ వీడ్కోలు మ్యాచ్‌ వ్యవహారాన్ని అఫ్రిది తెరపైకి తీసుకొచ్చాడంటూ విమర్శలు గుప్పించాడు. ఈ వ్యాఖ్యలు అఫ్రిదికి కోపం తెప్పించాయి.

‘డబ్బులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేది మియాందాదే. పాకిస్థాన్‌ దిగ్గజం ఇమ్రాన్‌ ఖాన్‌కు అతడికి మధ్య తేడా కూడా అదే’ అంటూ ఘాటుగా స్పందించాడు. దీంతో చిర్రెత్తిపోయిన మియాందాద్‌ ‘గెలవాల్సిన మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ను చాలాసార్లు అఫ్రిది ఓడించాడు. ఈ విషయం అబద్ధమని తన పిల్లలపై ప్రమాణం చేసి చెప్పమనండి. అతడి చేష్టలకు నేనే సాక్షిని. ఎన్నోసార్లు నాకు అడ్డంగా దొరికిపోయాడు’ అంటూ గట్టిగా బదులిచ్చాడు. ఈ విమర్శలతో ఆవేదన చెందిన అఫ్రిది.. మియాందాద్‌ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే తాజాగా దావూద్‌ హెచ్చరికల నేపథ్యంలో అఫ్రిది మొండిగా ముందుకు వెళ్తాడా.. లేక వెనక్కి తగ్గుతాడో చూడాలి.

Loading...

Leave a Reply

*