పోర్న్ వీడియోలో న‌టిస్తే.. 33వేలు ఇస్తాం.. స్టూడెంట్స్‌కి యూనివ‌ర్శిటీ ఆఫ‌ర్‌…!

unnamed

ఇది విన్నారా..? పోర్న్ వీడియోలో న‌టించిమ‌ని ఏకంగా ఓ యూనివ‌ర్శిటీ అధికారులే విద్యార్ధుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్‌లు కూడా దీనిని స‌మ‌ర్ధిస్తున్నారు. ఇదేంటి అనుకుంటున్నారా? అదేం లేదు. సింపుల్ మేట‌ర్‌. కండోమ్‌ల‌పై యువత‌లో ఉన్న అపోహ‌లు తొల‌గించేందుకు గ్రేట్ బ్రిట‌న్‌లోని కోవెంట్రీ యూనివ‌ర్శిటీ ఓ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. దీనికోసం 18-25 ఏళ్లున్న మూడు జంట‌ల‌తో పోర్న్ వీడియోలు చేసి జ‌నాల‌ని చైత‌న్య‌ప‌ర‌చాల‌ని భావించింది. దీంతో, ఈ వీడియోల‌లో న‌టించే విద్యార్ధుల‌కు 30వేలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది యూనివ‌ర్శిటీ.

అయితే, వీటిని ప‌క్కా పోర్న్ వీడియోలా చేస్తామ‌ని చెబుతోంది. కాస్త శృంగారాన్ని ఒలికించేవారికే ఈ చాన్స్ అని అంటోంది. ఇది ఫ్రీగా చెయ్యాల్సిన ప‌నిలేద‌ని, ఒక్కొక్క‌రికి 33వేలు ఇస్తామ‌ని కూడా ఊరిస్తోంది. ఇంగ్లండ్‌లో ఇటీవ‌ల యూత్‌లో సెక్స్ అల‌వాట్లు పెరిగిపోతున్నాయ‌ట‌. ఇటు, ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యం పెర‌గ‌డంతో టీనేజ్ కుర్రాళ్ల‌లో ఎక్కువమంది వాటికి ఆక‌ర్షితులవుతున్నార‌ట‌. ముఖ్యంగా 15-24 ఏళ్ల వ‌య‌సులోపు కుర్రాళ్లు.. అన్ సేఫ్ సెక్స్ చేస్తున్నార‌ని, వారికి కండోమ్ ప్రాధాన్య‌త గురించి చెప్ప‌డ‌మే వీరి ప్ర‌ధాన ఉద్దేశ్య‌మ‌ట‌. అందుకే, ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ట కోవెంట్రీ యూనివ‌ర్శిటీ.

మ‌రోవైపు, కండోమ్‌ల‌పై ఉన్న అపోహ‌లు తొల‌గించ‌డం కూడా ప్ర‌ధాన ఉద్దేశ్య‌మ‌ట‌. కండోమ్‌లు తొడుక్కుంటే మూడ్ రాద‌ని భావించే వారికి, వాటి ఉప‌యోగంతో శృంగారానుభూతిలో ఎటువంటి తేడా ఉండదని, వాటిని వాడడం ద్వారా ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చని తెలిపింది. ముఖ్యంగా యువకులు కండోము లేకుండా ఆవేశంలో శృంగారంలో పాల్గొంటూ వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వారిలో కండోములపై ఉన్న అపోహలను తొలగించేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

Loading...

Leave a Reply

*