బ‌హ‌మాస్ లీక్స్‌కి.. చిరు,నాగ్, జ‌గ‌న్‌కి లింక్‌..?

nimma

బ‌హ‌మాస్ పేప‌ర్స్ లీక్‌తో తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోతున్నాయి…. పారిశ్రామిక‌వేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు బ్రేక్ అయిపోతున్నారు… నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ పేరు బ‌హ‌మాస్ పేప‌ర్స్‌లో లీక్ అవ‌డంతో ఆయ‌నతో సంబంధాలు ఉన్న సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ప‌రేషాన్ అవుతున్నార‌ని స‌మాచారం… నిమ్మ‌గ‌డ్డ తీగ లాగితే త‌మ డొంక క‌దులుతుంద‌ని వాళ్లు బెంబేలెత్తిపోతున్నార‌ని తెలుస్తోంది… నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌కు చాలామంది రాజ‌కీయ నేత‌లు, సినీ ప్ర‌ముఖుల‌తో స‌త్సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి…నిమ్మ‌గ‌డ్డ‌, చిరంజీవి, నాగార్జున బిజినెస్ పార్ట‌న‌ర్స్‌… నిమ్మ‌గ‌డ్డ లాగానే వాళ్లు కూడా వేల కోట్లు సంపాదించారు…

అయితే బ‌హ‌మాస్ పేప‌ర్ల‌లో ఇప్పుడు నిమ్మ‌గ‌డ్డ పేరు బ‌య‌ట‌కు రావ‌డంతో చిరంజీవి, నాగార్జున ఉలిక్కిప‌డుతున్నార‌ని స‌మాచారం…. నిమ్మ‌గ‌డ్డ బాట‌లోనే చిరంజీవి, నాగార్జున కూడా బ‌హ‌మాస్‌లో వేల కోట్ల రూపాయ‌ల బ్లాక్‌మ‌నీని దాచి ఉంటార‌ని కొంద‌రు భావిస్తున్నారు… దీనిపై విచార‌ణ జ‌రిగితే న‌ల్ల‌కుబేరులంతా బ‌య‌ట‌ప‌డ‌తార‌ని మేధావులు అంటున్నారు… ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ విచార‌ణ జ‌రిగితే అది త‌మ పీక‌కు చుట్టుకుంటుందేమో అని చిరు, నాగ్ క‌ల‌వ‌ర‌ప‌డుతున్నార‌ని చెబుతున్నారు…. మ‌రోవైపు బ‌హ‌మాస్ లీక్స్‌తో జ‌గ‌న్‌కి కూడా లింకులు ఉన్నాయేమో అని మ‌రికొంద‌రు అనుమానిస్తున్నారు..

నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ జ‌గ‌న్ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టారు… ఇది క్విడ్ ప్రో కో అని గ‌తంలో సీబీఐ కేసు పెట్టి నిమ్మ‌గ‌డ్డ‌ను కొన్నాళ్ల‌పాటు జైలు పాలు చేసింది… ఈ నేప‌థ్యంలో నిమ్మ‌గ‌డ్డ పేరు బ‌య‌ట‌కు రావ‌డంతో జ‌గ‌న్ కూడా ఉలిక్కి ప‌డుతున్న‌ట్టు స‌మాచారం…. నిమ్మ‌గ‌డ్డ‌ను ద‌ర్యాప్తు సంస్థ‌లు విచారిస్తే అది త‌న మెడ‌కు చుట్టుకుంటుందేమో అని జ‌గ‌న్ హ‌డ‌లిపోతున్న‌ట్టు తెలుస్తోంది… మొత్తానికి నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంది.

Loading...

Leave a Reply

*