ఏడాదిలో అనుకున్న‌ది సాధించిన చంద్ర‌బాబు

chandra-babu

చంద్ర‌బాబు పాల‌నా కేంద్రం మ‌ళ్లీ మార‌నుంది. విభ‌జ‌న త‌ర్వాత అధికారం చేపట్ట‌గానే హైద‌రాబాద్ నుంచి ఆయ‌న ప‌రిపాల‌న సాగించారు. అనూహ్యంగా కొన్ని ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డంతో ఆయ‌న విజ‌య‌వాడ‌కు మ‌కాం మార్చాల్సి వచ్చింది. అప్ప‌టి నుంచి ఆయ‌న కృష్ణ న‌ది ఒడ్డు నుంచి పాల‌న సాగించ‌డం మొద‌లుపెట్టారు. ఇక ఇప్పుడు వెల‌గ‌పూడిలోని తాత్కాలిక స‌చివాల‌యం పూర్తికావ‌డంతో ఉద్యోగులంతా అక్క‌డికి త‌ర‌లి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లోని స‌చివాల‌యం పూర్తిగా ఖాళీ చేసి ఉద్యోగులు వెల‌గ‌పూడిలో కుదురుకున్నారు. మంత్రులు కూడా ఒక్కొక్క‌రు కొత్త స‌చివాల‌యంలో కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తున్నారు. విజ‌య‌ద‌శమి రోజున ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యానికి మారాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

మంగ‌ళ‌వారం నుంచి చంద్ర‌బాబు కార్యాల‌యం వెల‌గ‌పూడి నుంచి ప‌ని చేయ‌డం ప్రారంభిస్తుంది. గ‌త ఏడాది స‌రిగ్గా విజ‌య‌ద‌శ‌మి రోజున మోడీతో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి చంద్ర‌బాబు శంకుస్తాప‌న చేయించారు. స‌రిగ్గా ఏడాది టార్గెట్ పెట్టుకుని స‌చివాల‌య నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఏడాది త‌ర్వాత అదే విజ‌య‌ద‌శ‌మి రోజున చంద్ర‌బాబు వెల‌గ‌పూడిని పాల‌నాకేంద్రంగా మార్చ‌బోతున్నారు. ఇక‌, ఏపీకి అన్ని విజ‌యాలే.

Loading...

Leave a Reply

*