ఈ బాలీవుడ్ విల‌న్‌ త‌మ్ముడి భార్య‌నే….!

nawajuddin-siddique

మీరు బాలీవుడ్ సినిమాలు బాగా చూస్తారా..? అయితే, మీకు న‌వాజుద్దీన్ సిద్దిఖీ పరిచ‌యం ఉండే ఉంటుంది. ఈ బాలీవుడ్ కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్ క‌మ్ విల‌న్ చివ‌రికి ఆఖ‌రికి త‌న త‌మ్ముడి భార్య‌నే వేధించాడ‌ట‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్‌లో ఆయ‌న సోద‌రుడు.. త‌న భార్య‌ని అన్న నవాజుద్దీన్ సిద్దిఖీ వేధించాడ‌ని కేసు ఫైల్ అయింది. విచార‌ణ‌లో భాగంగా ఆయ‌న పోలీస్ స్టేష‌న్‌లో హాజ‌ర‌య్యారు. అది త‌ప్పుడు కేస‌ని, త‌మ్ముడి భార్య‌ని వేధించ‌లేద‌ని, ఈ కేసుతో త‌న‌కు సంబంధః కూడా లేద‌ని లిఖిత పూర్వ‌కంగా రాసి ఇచ్చాడు.

క‌ట్నం కోసం త‌న‌ను న‌వాజుద్దీన్ సిద్దిఖీ కుటుంబం వేధిస్తోంద‌ని ఆమె కేసు ఫైల్ చేసింది. అన్నాద‌మ్ముల‌ను విచారించిన పోలీసులు… చివ‌రికి, ఇద్ద‌రూ మ‌హిళా పోలీస్ స్టేష‌న్‌లో హాజ‌రు కావాల‌ని సూచించారు. పెద్ద‌ల స‌మ‌క్షంలో కేసును ప‌రిష్కరించుకోవాల‌ని పోలీసులు చెప్పారు.
తన భర్త, ఆయన సోదరులు, ఆడపడచు కట్నం కోసం వేధిస్తున్నారంటూ నవాజుద్దీన్ సోదరుడు మినాజుద్దీన్ భార్య అఫ్రీన్ గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, త‌మ‌ను రోడ్డుకీడ్చ‌డానికి, కేవలం పబ్లిసిటీ కోసం తమపై కేసు పెట్టిందని నవాజుద్దీన్ ఆమె ఆరోపణల్ని కొట్టిపారేశాడు.

Loading...

Leave a Reply

*