ఎనీ కాల్‌.. 25 పైస‌లు.. బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌…!

bsnl

రిల‌య‌న్స్ ముఖేష్ అంబానీ ఏమంటా.. డేటాగిరీ అంటూ జియోతో 4జీ లాంచ్ చేశాడో.. భార‌త టెలికామ్ చ‌రిత్ర‌లో కొత్త చరిత్ర మొద‌ల‌యింది. డేటాగిరీ ఆయ‌న తీసుకువ‌స్తాడో లేదో అన్న‌ది త‌ర్వాత తేల‌నుంది. కానీ, ఇంత‌లోనే ఇత‌ర టెలికామ్ కంపెనీలు జియో స్పీడ్‌తో పోటీలు ప‌డుతున్నాయి. రిల‌య‌న్స్ పూర్తిగా మార్కెట్‌పై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించక ముందే… ఇత‌ర కంపెనీలు త‌మ వినియోగ‌దారుల‌ను నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నంలో బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల‌లో రిల‌య‌న్స్‌తో పోటీ ప‌డే నెట్‌వ‌ర్క్ ఉన్న బీఎస్ఎన్ఎల్ జియో దూకుడుకు అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. రీసెంట్‌గా బీఎస్ఎన్ఎల్ ప్ర‌క‌టించిన ఫ్రీడ‌మ్ 136 ఆఫ‌ర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఈ ప్లాన్ ధ‌ర రూ.136 కాగా, వాలిడిటీ 730 రోజులు. ఈ ప్లాన్ ప్ర‌కారం బీఎస్ఎన్ఎల్ యూజ‌ర్‌లు లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌కు ఎక్క‌డి నుంచైనా ఏ నెట్‌వ‌ర్క్‌కి అయినా మొద‌టి నెల రోజుల పాటు 25 పైస‌లు మాత్ర‌మే చెల్లించి కాల్స్ చేసుకోవ‌చ్చు. దీంతోపాటు మొద‌టి 30 రోజుల వ్య‌వ‌ధిలో 1జీబీ డేటాను పొందే అవ‌కాశం ఉంటుంది. నెల రోజులు దాటిన తర్వాత కాల్ చార్జీలు 1.3 పైస‌లుగా ఉంటే చాన్స్ ఉంటుంది.బీఎస్ఎన్ఎల్ ఫ్రీడ‌మ్ ప్లాన్ ఎంచుకున్న యూజ‌ర్‌ల‌కు రూ.577, రూ. 377, రూ.178.. ఇలా మూడు ర‌కాల టాప‌ప్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి.

రూ.577 టాప‌ప్ ప్లాన్‌ను ఎంచుకున్న యూజ‌ర్‌ల‌కు 30 రోజుల వేలిడిటితో 1 జీబీ డేటా పొంద‌వ‌చ్చు. రూ.377 టాప‌ప్ ప్లాన్ ఎంపిక చేసుకున్న యూజ‌ర్‌కు పూర్తి టాక్‌టైమ్‌తోపాటు 300 ఎమ్‌బీ డేటా (20 రోజుల‌) వేలిడిటితో ల‌భిస్తుంది. రూ.178 టాప‌ప్ ప్లాన్‌ను ఎంపిక చేసుకున్న యూజ‌ర్‌కు పూర్తి టాక్‌టామ్‌తో 200 ఎమ్‌బీ డేటా (10 రోజుల) వ్య‌వ‌ధితో ల‌భిస్తుంది. మొత్త‌మ్మీ, బీఎస్ఎన్ఎల్ క‌స్ట‌మ‌ర్‌ల‌కు ఇది మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్.

Loading...

Leave a Reply

*