బి.ఎస్.ఎన్.ఎల్ బంపర్ ఆఫర్

untitled-9

ఇండియ‌న్ టెలికం రంగంలోకి తుఫాన్‌లా దూసుకువ‌చ్చిన జియో ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది… ఫ్రీ వాయిస్ కాల్స్, ఫ్రీ డేటా అంటూ జ‌నానికి ఫీవ‌ర్ తెప్పించింది… జియో జ్వరంతో జ‌నం ఊగిపోతున్నారు… దీంతో జియోని ఎదుర్కోవ‌డానికి మిగిలిన నెట్‌వ‌ర్క్‌లు కూడా న‌డుం బిగించాయి.. ఈ రేసులో ఎయిర్‌టెల్ ముందుంది.. లేటెస్ట్ గా బీఎస్ఎన్ఎల్ కూడా ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌తో ముందుకువ‌చ్చింది…ఈ ఆఫర్ పేరు ఫ్రీడ‌మ్ ప్లాన్‌… 136 రూపాయ‌ల‌తో ఒక్కసారి రీచార్జి చేసుకుంటే రెండేళ్ల పాటు మాట్లాడుకోవ‌చ్చు….90 రోజుల ప్రమోష‌న్ బేసిస్‌లో భాగంగా ఈ ఆఫ‌ర్‌ను అన్ని ప్రధాన స‌ర్కిళ్లలో లాంచ్ చేసింది… 136 రూపాయ‌ల‌తో మీరు రీచార్జి చేసుకుంటే 2 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది… అత్యంత త‌క్కువ ధ‌ర‌ల కాల్ రేట్స్ ఉంటాయి..

కొత్తవారికి, పాత‌వారికి ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది…రీచార్జి చేసిన మొద‌టి నెల‌లో ఎస్టీడీ, నెట్‌, అలాగే ఆఫ్‌నెట్ కాల్స్‌కు నిమిషానికి 25 పైస‌లు చొప్పున చార్జ్ చేస్తారు… ఆ త‌ర్వాత సెకండ్‌కి 1.3 పైస‌లు చార్జ్ చేస్తారు…ఈ ఆఫ‌ర్ తీసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ డేటా కూడా ఫ్రీగా ఇస్తారు……ఎస్సెమ్మెస్స్‌కు హోమ్ స‌ర్కిల్లో 1 రూపాయి చార్జ్ చేస్తారు….లోక‌ల్ 25 పైస‌లు, అలాగే ఎస్టీడీకి 38 పైస‌లు చార్జ్ చేస్తారు… ఇంతేకాకుండా 577 రూపాయ‌ల స్పెష‌ల్ కాంబో ప్యాక్‌ని కూడా విడుద‌ల చేశారు….దీంట్లో కూడా 30 రోజుల వ్యాలిడిటీతో మీకు 1 జీబీ డేటా ల‌భిస్తుంది… అలాగే 577 రూపాయ‌ల‌కు ఫుల్ టాక్‌టైమ్ కూడా ఇస్తారు… ఇదే కాక 377 రూపాయ‌ల‌తో మ‌రో ప్లాన్ కూడా లాంచ్ చేశారు…దీంట్లో కూడా ఫుల్ టాక్‌టైమ్ ల‌భిస్తుంది… దీంతోపాటు 177 రూపాయ‌ల మ‌రో ప్లాన్ కూడా అందిస్తున్నారు.. ఇది తీసుకుంటే 177 రూపాయ‌ల ఫుల్ టాక్‌టైమ్‌తో పాటు 200 ఎంబీ డేటా ఫ్రీగా వ‌స్తుంది… త‌న స్మార్ట్ ఆఫ‌ర్లతో జియోకి భారీగా ఝ‌ల‌క్ ఇచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమైంది.

Loading...

Leave a Reply

*