విశాఖ డ్రైనేజీలో కోట్లు గుమ్మ‌రించి ప‌రారీ.. ఏరుకునేందుకు ఎగ‌బ‌డ్డ జ‌నం..!

vizag

అంతా మోదీ ప్ర‌భావం. 500, 1000 నోట్ల‌ను ఏ ముహూర్తాన ర‌ద్దు చేశాడో కానీ దేశ వ్యాప్తంగా ఆర్ధిక ఎమ‌ర్జెన్సీ ఏర్ప‌డింది. ఇటు సామాన్యులు చిల్ల‌ర, రోజువారీ ఖ‌ర్చుల కోసం బ్యాంక్‌లు, ఏటీఎమ్‌ల ద‌గ్గ‌ర గంట‌ల త‌ర‌బ‌డి క్యూలు క‌డుతుంటే.. బ‌డా బాబులు , న‌ల్ల కుబేరులు ఆడిట‌ర్‌లు, ఫైనాన్స్ అడ్వ‌యిజ‌రీ సంస్థ‌ల చుట్టూ తిరుగుతున్నారు.

అది కూడా చెయ్య‌లేని వాళ్లు కొంద‌రు.. త‌మ డ‌బ్బును గోనె సంచుల‌లో ప‌డేసి విసిరేస్తున్నారు. తాజాగా విశాఖ‌లోనే ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను డ్రైనేజీలో విసిరెయ్య‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను హెచ్‌బీ కాల‌నీ, భానున‌గ‌ర్ మురుగు కాల్వ‌లో పడేసి పారిపోయాడు. వీటిని గ‌మ‌నించిన స్థానికులు.. వాటిని ఏరుకోవ‌డానికి పరుగులు పెట్టారు. చిన్న సైజ్ కొట్లాట మాదిరి ర‌భ‌స జ‌రిగింది. దీంతో, ఆ ప్రాంతాల‌లో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. పోలీసులు వ‌చ్చి అదుపు చేశారు. అయితే, అది కోట్ల‌లో ఉండ‌వ‌చ్చ‌ని స‌మాచారం. ఇది ఎవ‌రిది అనేది తెలియరాలేదు. దీనిపై పోలీసులు, అధికారులు ఎంక్వ‌యిరీ చేస్తున్నారు. కొంద‌రు స్థానికులు మాత్రం భారీగానే ద‌క్కించుకున్నార‌ట‌.

Loading...

Leave a Reply

*