ఆ న‌ల్ల‌ధ‌నం అధిప‌తి జ‌గ‌నేనా?

jagan

న‌ల్ల‌ధ‌నం స్వ‌చ్ఛందంగా వెల్ల‌డిచాలంటూ కేంద్రం ఇచ్చిన ఆఫ‌ర్‌తో చాలామంది త‌మ న‌ల్ల‌ధ‌నాన్ని వైట్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మ‌డి రాధాని హైద‌రాబాద్ దేశంలోనే సంచ‌ల‌నం సృష్టించింది. ఇందుకు కార‌ణం దేశ‌వ్యాప్తంగా పాతిక‌వేల కోట్ల న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌కొస్తే… ఒక్క ఏపీలోనే ప‌ద‌మూడు వేల కోట్ల రూపాయ‌ల సంప‌ద వైట్‌గా మారింది. అంటే బ‌య‌ట‌కొచ్చిన మొత్తం న‌ల్ల‌ద‌నంలో సగం హైద‌రాబాద్‌లోని ఆదాయ‌ప‌న్ను శాఖ ప‌రిధిలోదే కావ‌డం గ‌మనార్హం. అందులోనే ఒకే వ్య‌క్తి ప‌ది వేల కోట్ల రూపాయ‌ల‌కు లెక్క‌లు చెప్పి ప‌న్ను క‌ట్టార‌ని వెల్ల‌డైంది. ఇప్పుడు ఆ ప‌దివేల కోట్లు వైట్ చేసుకుంది ఎవ‌రూ అన్న‌దానిపై చ‌ర్చ మొద‌లైంది. టీడీపీ నేత‌లు ఏకంగా ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌నే టార్గెట్ చేశారు. ఆ ప‌దివేల కోట్లు వెల్ల‌డించింది జ‌గ‌నేన‌ని మంత్రి దేవినేని ఉమ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంత్రి ఒక్క‌డే అంటే ఏదో రాజ‌కీయంగా ఇరుకున పెట్ట‌డానికి అన్నారులే అనుకోవ‌చ్చు.

బ‌ట్‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా అంత పెద్ద‌మొత్తంలో డ‌బ్బు వైట్ చేసుకున్న వ్య‌క్తులు వ్యాపార‌వేత్త‌లు అయి ఉండ‌రని, రాజ‌కీయ నాయ‌కులే అయి ఉంటార‌ని వ్యాఖ్యానించారు. ఆ వెంట‌నే ఉమ మీడియా ముందుకొచ్చి ఆ సంప‌ద జ‌గ‌న్‌దేన‌ని చెప్పేశారు. కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం న‌ల్ల‌ధ‌నం వివ‌రాలు వెల్ల‌డించిన వారి పేర్లు బ‌య‌ట‌పెట్ట‌రాద‌ని నిర్ణ‌యించింది. కానీ ఏపీ అధికార పార్టీ నేత‌ల వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు మొద‌ల‌య్యాయి. వీటిని జ‌గ‌న్ ఎలా ఎదుర్కొంటారో.

Loading...

Leave a Reply

*