బాబు మ‌ద్ద‌తు హిల్ల‌రికీ… ట్రంప్ వెనుక చిరంజీవి?

chiru-and-babu

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో మ‌న‌వాళ్లంతా హిల్ల‌రీ క్లింట‌న్ వెనుకే ఉన్న‌ట్లు తెలుస్తోందంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప‌రిమిత స్థాయిలోనే ఉన్న తెలుగువారు ఈ ఎన్నిక‌ల‌లో హిల్ల‌రీకే అండ‌గా నిల‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. అలాగే, ట్రంప్‌కు న‌లుగురు భార్య‌లున్నార‌ని అక్క‌డ నైతిక విలువ‌లు లేవ‌ని కూడా వ్యాఖ్యానించారు. కుటుంబాల‌ను కాపాడుకోవాల‌ని, త‌ద్వారా విలువ‌లు నిల‌బ‌డ‌తాయ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. అంటే మొత్తం మీద చంద్ర‌బాబు కూడా హిల్ల‌రీకే మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్లు దీనిద్వారా అర్థ‌మ‌వుతోంది. ఇక‌, ఏపీలోచంద్ర‌బాబుతో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డుతున్న కాంగ్రెస్ నేత చిరంజీవి కుమారుడు రాంచ‌రణ్ మాత్రం ట్రంప్‌కు మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి కార‌ణం….అమెరికాలోని న్యూసెర్సీలో జ‌రిగే ఒక కార్య‌క్ర‌మంలో రాంచ‌ర‌ణ్‌, అఖిల్‌, శ్రీయ‌లు పాల్గొంటున్నారు.

ఉగ్ర‌వాద బాధితుల‌ను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మానికి అధ్య‌క్ష అభ్య‌ర్థి ట్రంప్ కూడా వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. భార‌తీయులు ఎక్కువ‌గా ఉండే న్యూజెర్సీలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుండ‌డం… ఇందులో పాల్గొంటే వారి ఓట్ల‌ను ఆక‌ర్షించ‌వ‌చ్చ‌ని భావిస్తుండ‌డంతోనే ట్రంప్ దీనికి హాజ‌రు కావాల‌ని యోచిస్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. నిజంగానే ఈ కార్య‌క్ర‌మానికి ట్రంప్ హాజ‌రైతే… చిరంజీవి వార‌సుడు రాంచ‌ర‌ణ్ ఇందులో ఉంటున్నారు కాబ‌ట్టి అత‌డూ విధిలేని ప‌రిస్థితుల్లో ట్రంప్‌తో వేదిక పంచుకోవాల్సిందే. అదే జ‌రిగితే ప‌రోక్షంగా అయిన రాంచ‌ర‌ణ్‌ ట్రంప్‌కు మ‌ద్ద‌తిచ్చిన‌ట్లే అవుతుంది. ఈ నేప‌థ్యంలోనే హిల్ల‌రీకి మ‌ద్ద‌తుగా చంద్ర‌బాబు, ట్రంప్‌కు బాస‌టగా చిరంజీవి అంటూ సెటైర్లు మొద‌ల‌య్యాయి. స‌ర‌దాగా ఊహించుకోవ‌డానికి, చ‌దువుకోవ‌డానికి ఈ వార్త‌లు బానే ఉంటాయి క‌దా మ‌రి.

Loading...

Leave a Reply

*